న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంకాలజీలో ఇన్ఫోసిస్ చైర్‌గా లండన్‌లోని క్యాన్సర్ రీసెర్చ్ యూకే బార్ట్స్ సెంటర్‌కు చెందిన గైనకాలజికల్ ఆంకాలజిస్ట్ రంజిత్ మంచాందా నియమితులయ్యారు.రంజిత్.
ఎయిమ్స్ గైనకాలజీ ఆంకాలజీలో పూర్వ విద్యార్ధి కావడం గమనార్హం.పీహెచ్‌డీ కోసం యూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌కి వెళ్లడానికి ముందు 1990లలో ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు.
క్యాన్సర్‌పై రంజిత్ పరిశోధనలు ఖచ్చితమైన నివారణను లక్ష్యంగా చేసుకున్నాయి.అలాగే రిస్క్ ప్రిడిక్షన్, టార్గెటెడ్ స్క్రీనింగ్, క్యాన్సర్ నివారణ, జెర్మ్ లైన్ టెస్టింగ్ వంటికి రంజిత్ ప్రాధాన్యత ఇచ్చారు.
ఎండోమెట్రియల్ క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స నివారణ వ్యూహాలను అభివృద్ధి చేయడం, క్యాన్సర్ నిర్థారణ, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ నివారణ, జన్యు పరీక్ష వ్యూహాలను అభివృద్ధి చేయడం వంటి వాటిపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు.
ప్రస్తుతం రంజిత్ లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలోని వోల్‌ఫ్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్‌లో గైనకాలజికల్ ఆంకాలజీ అండ్ బార్ట్స్ హెల్త్, నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్‌లో కన్సల్టెంట్ గైనకాలజికల్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
వీటిలో అనేక కీలకమైన పరిశోధనా ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహిస్తున్నారు.అండాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ఇందులో ఒకటి.

ఇన్ఫోసిస్ చైర్ హోదాలో ఆయన ఎయిమ్స్ గైనకాలజికల్ ఆంకాలజీ విభాగానికి మద్ధతుగా వుంటారు.అంతేకాదు ఆయన నియామకం వల్ల క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, బార్ట్స్ హెల్త్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్, ఎయిమ్స్ మధ్య సహకారాన్ని పెంచుతుంది.రంజిత్ 2020-21లో కొలంబియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ రీసెర్చ్ ఫౌండేషన్ అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు.
ఇకపోతే.భారతదేశంలో జననేంద్రియ క్యాన్సర్ బారినపడి మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఒక ఏడాదిలో నమోదయ్యే క్యాన్సర్ మరణాల్లో 3.34 శాతం జననేంద్రియ క్యాన్సర్ వల్లే చోటు చేసుకుంటున్నాయి.ముందస్తు స్క్రీనింగ్ లేకపోవడం, సరైన సమయంలో గుర్తించకపోవడం వల్లే ఈ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి.







