ఎట్టకేలకు జోరు పెంచిన 'ఆహా'.. ఇక వాటికి చుక్కలే

థియేటర్లకు కాలం చెల్లబోతుంది.రాబోయే పదేళ్లలో థియేటర్ల సంఖ్య సగానికి పైగా పడిపోతుంది.

మల్టీప్లెక్స్‌లు పెరుగుతాయి.సింగిల్‌ స్క్రీన్ సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగు అయ్యే కాలం కూడా వస్తుంది.

ఇలాంటి సమయంలో ఓటీటీలకు ఆధరణ పెరుగుతుంది.తెలుగు కంటెంట్‌ కోసం ప్రత్యేకంగా అల్లు అరవింద్‌ ఆహాను ప్రారంభించాడు.

కేవలం తెలుగు కంటెంట్‌ ఉంటుందని మొదటే ప్రకటించాడు.అన్నట్లుగానే తెలుగు కంటెంట్‌ తో నెట్టుకు వస్తున్నారు.

Advertisement

అయితే ఇతర భాషల కంటెంట్‌ కూడా కలిగి ఉన్న అమెజాన్‌ మరియు హాట్‌ స్టార్‌ వంటివి ఆహాను దెబ్బకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.పెద్ద సినిమాలను కొనుగోలు చేస్తూ వచ్చాయి.

అయితే అల్లు అరవింద్‌ తన మాస్టర్‌ ప్లాన్‌ తో మెల్లగా ఆహా సభ్యత్వాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చాడు.వెబ్‌ కంటెంట్‌ అంటే చిన్న బడ్జెట్‌ సినిమాలు చిన్న వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

ఇన్ని రోజులు ఆహా గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు.కాని గత రెండు నెలల కాలంగా మలయాళం నుండి మంచి సినిమాలను తీసుకుని డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.

దానికి తోడు కంటెంట్‌ ప్రధానంగా ఉండే సినిమాలను చిన్న బడ్జెట్‌ సినిమాలను విడుదల చేస్తూ వచ్చారు.కోటి లోపు బడ్జెట్‌ తో వచ్చిన సినిమాలు ఆహాలో మంచి పేరు దక్కించుకున్నాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

అందుకు చిన్న సినిమాలు ఆహాకు క్యూ కడుతున్నాయి.ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా మరికొన్ని సినిమాలు కూడా ఆహా వైపు చూస్తున్నాయి.

Advertisement

ఆహాలో విడుదల చేస్తే ఎక్కువ మందికి రీచ్‌ అయ్యే అవకాశం ఉందని, తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఆహా అక్కడ ఉంది కనుక అందరి కి చేరు అవ్వాలనే ఉద్దేశ్యంతో ఆహాలో తమ సినిమాల స్ట్రీమింగ్‌ను కోరుకుంటున్నారు.దాంతో ఆహా కూడా వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వస్తుంది.

ఆహాలో కంటెంట్‌ పెరుగుతున్న నేపథ్యంలో జీ5, అమెజాన్‌, హాట్‌ స్టార్‌.నెట్‌ప్లిక్స్‌ ఇలా అన్నికూడా వెనుక పడే అవకాశం ఉంది.

ముందు ముందు ఆహా వారు మరింతగా కంటెంట్‌ ను ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంది.

తాజా వార్తలు