స్వేచ్ఛ లేదు.. తొక్క లేదు.. తొక్కేయండి.. ఏబీఎన్‌పై జగన్‌ తాజా మాట!

జీవో 2430.మీడియా గొంతు నొక్కడానికి ఏపీలో జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో ఇది.

ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే సంబంధిత శాఖల కార్యదర్శులే జర్నలిస్టులపై కేసులు పెట్టొచ్చంటూ ఈ జీవోలో స్పష్టం చేశారు.ఇలా తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక, వాళ్లకు చెందిన ఏబీఎన్‌ చానెల్‌పై ఆయనకు మరింత అక్కసు.దీనిని ఏమాత్రం దాచుకోకుండా ఎన్నికల ప్రచారాల్లోనే చెప్పేవారు.

తన ప్రత్యర్థి చంద్రబాబు ఒక్కడే కాదు.ఏబీఎన్‌లాంటి చానెల్స్‌ కూడా అని.అందుకు తగినట్లే అధికారంలోకి రాగానే ఏబీఎన్‌తోపాటు టీవీ 5 చానెల్‌ ప్రసారాలను కూడా నిలిపేయాలని ఆదేశించారు.

Agan Latest Abn Andhra Jyothi News Channel
Advertisement
Agan Latest Abn Andhra Jyothi News Channel-స్వేచ్ఛ లేదు..

అయితే దీనిపై న్యాయపోరాటం చేసిన ఆ రెండు చానెల్స్‌ ప్రభుత్వంపై విజయం సాధించాయి.మళ్లీ ప్రసారాలను పునరుద్ధించుకున్నాయి.కానీ తాజాగా మరోసారి ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆ చానెల్‌ టీవీల్లో రావద్దంటూ మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని.ఎమ్మెస్వోలను పిలిచి హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Agan Latest Abn Andhra Jyothi News Channel

నిజానికి చానెల్స్‌పై నిషేధం భావప్రకటన స్వేచ్ఛపై దాడే అంటూ ప్రభుత్వానికి చెందిన ఫైబర్‌ నెట్‌కు 5 లక్షల జరిమానా కూడా విధించింది టీడీ-శాట్‌.మళ్లీ ప్రసారాలను ఆపొద్దని కూడా స్పష్టం చేసింది.దీంతో ఎమ్మెస్వోలు అదే పని చేస్తున్నారు.

అయితే వాళ్లపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నట్లు తాజా ఘటనతో మరోసారి నిరూపితమైంది.ఇన్నాళ్లూ ఫ్రీ టు ఎయిర్‌ చానెల్స్‌ జాబితాలో ఉన్న ఏబీఎన్‌ చానెల్‌ను మరో ప్యాకేజీలోకి మార్చామని, డబ్బులు కడితేనే ఆ చానెల్‌ వస్తుందని ఎమ్మెస్వోలు టీవీల్లో స్క్రోలింగ్‌ ఇస్తున్నారు.

ఫ్రీ చానెల్‌కు డబ్బులు ఎందుకు కట్టాలని కస్టమర్లు నిలదీస్తున్నా.ఎమ్మెస్వోలు మాత్రం ఈ స్క్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఆ చానెల్‌ నిలిపివేతకు జగన్‌ సర్కార్‌ మళ్లీ ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు