కులవివక్షపై నిషేధం.. సీటెల్ బాటలో కెనడియన్ సిటీ టొరంటో, ప్రయత్నాలు ముమ్మరం

సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్ష అనే సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు ఎందరో మహనీయులు కృషి చేశారు.కానీ ఇది మాత్రం సమాజాన్ని వీడిపోవడం లేదు.

ఇకపోతే.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని సీటెల్ నగరం సంచలన తీర్మానం చేసింది.

కుల వివక్ష చట్ట విరుద్ధమని ప్రకటించిన తొలి అమెరికా నగరంగా నిలిచింది.ఇందుకోసం భారత సంతతికి చెందిన క్షమా సావంత్ మొక్కవోని పోరాటం చేశారు.

ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీటెల్ సిటీ కౌన్సిల్ 6-1 ఓట్ల తేడాతో ఆమోదించింది.కుల వివక్షను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించడం వల్ల దక్షిణాసియా ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయులకు, హిందువులకు ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభించినట్లేనని కౌన్సిల్ అభిప్రాయపడింది.

Advertisement

అమెరికాలోని కంపెనీలు, కార్యాలయాల్లో దక్షిణాసియా వాసులు, వలస కార్మికులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారని క్షమా సావంత్ తన తీర్మానంలో తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక తీర్మానానికి సీటెల్ కౌన్సిల్ తీర్మానం లభించిన నేపథ్యంలో క్షమా సావంత్ .దీనిని అమెరికా వ్యాప్తం చేయాల్సిన అవసరం వుందన్నారు.

తాజాగా సీటెల్ నగరం నుంచి స్పూర్తి పొందారో లేక వారంతట వారికే అనిపించిందో కానీ.కెనడాలోని టొరంటో సిటీ కూడా కుల వివక్షను బ్యాన్ చేయాలని చూస్తోంది.అక్కడ వున్న రెండు పక్షాల్లో ఒకటి కుల వివక్షపై నిషేధానికి అనుకూలంగా, మరొకటి వ్యతిరేకంగా వున్నాయి.

కుల వివక్షకు వ్యతిరేకంగా వున్న వారు టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ (టీడీఎస్‌బీ) ముందు మోషన్‌ను పరిశీలనకు తీసుకురావడం వరకు విజయం సాధించారు.మార్చి 8న జరిగిన సమావేశంలో బోర్డ్.

ఈ సమస్యను అధ్యయనం చేయడానికి, అంచనా వేయడానికి తటస్థ పరిశీలకుడిగా అంటారియో మానవ హక్కుల కమీషన్‌కు బాధ్యత అప్పగించింది.ఒకవేళ నిషేధం అమల్లోకి వస్తే.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

టొరంటోలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులందరికీ ఉత్తమ ప్రయోజనాలు దక్కుతాయని నిపుణులు అంటున్నారు.ఇక్కడి విద్యా వ్యవస్థలో అనేక రూపాల్లో కుల వివక్ష వుంది.

Advertisement

మరోవైపు.కుల వివక్షను నిషేధించాలన్న దానిపై హిందూ కూటమి (CoHNA) అభ్యంతరం తెలియజేస్తోంది.ఈ మేరకు కెనడాలోని హిందూ కమ్యూనిటీకి దాదాపు 21000లకు పైగా ఈమెయిల్స్‌ను పంపడంతో పాటు అనేక ఫోన్ కాల్స్‌ను చేసింది.

అలాగే నార్త్ యార్క్‌లోని టీడీఎస్‌బీ కార్యాలయం వద్ద ఓటింగ్ జరుగుతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.గడ్డకట్టే వాతావరణాన్ని లెక్క చేయకుండా వీరు గంటల తరబడి ఆందోళన నిర్వహించారు.

తాజా వార్తలు