రెండేళ్ల తర్వాత ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన కంగనా.. సంతోషంలో అభిమానులు?

బాలీవుడ్ బ్యూటీ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

కంగనా తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.సమాజంలో జరిగే పలు విషయాల పట్ల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు ఉంటుంది.

అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. కంగనా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ దాదాపుగా రెండేళ్ల తర్వాత ట్విట్టర్ లోకి అడుగు పెట్టింది.

Advertisement

మైక్రో బ్లాగింగ్ లాగిన్ వెబ్ సైట్ కంగనా అకౌంట్ పై మే 2021 లో బ్యాన్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఆ నిషేధాన్ని ట్విట్టర్ ఎత్తేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ట్విట్టర్లో హలో ఎవ్రీవన్ ఇట్స్ నైస్ టు బ్యాక్ హియర్ చేసింది.

అయితే కంగనా పోస్ట్ అయితే చేసింది కానీ ఆమె అకౌంట్ కి బ్లూటిక్ లేకపోవడం గమనార్హం.కంగనా రనౌత్ ట్విట్టర్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈమె బెంగాల్ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన పోస్టులను అప్పట్లో ట్వీట్ చేయడంతో అది పెద్ద కలకలం సృష్టించింది.

ఈ తరుణంలోనే తమ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కంగనా పై ట్విట్టర్ సంస్థ అకౌంట్ బ్యాన్ వేటు వేసింది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు