'రెడ్డి ' నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా ? 

సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ , వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( CM Jagan ) ముందుకు వెళుతున్నారు.

ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.

దానికి తగ్గట్లుగానే పార్టీ పదవులు,  నామినేటెడ్ పదవులలోను ఎక్కువగా ఆయా సామాజిక వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తున్నారు.దీంతో పాటు , మంత్రివర్గంలోనూ వారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.

  ఇప్పటి వరకు జరిగిన రెండు మంత్రివర్గ విస్తరణ లోను ఆ మార్క్ కనిపించింది.ఇదే రెడ్డి సామాజిక వర్గం నేతల్లో( Reddy Leaders ) అసంతృప్తిని రేపుతోంది.

పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచి , వైసిపి అధికారంలోకి వచ్చే విధంగా సామాజికంగా,  ఆర్థికంగా అండదండలు అందించిన తమను పక్కనపెట్టి సామాజిక వర్గాల లెక్కల్లో ఇతర వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండడంపై రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.ఈ అసంతృప్తి ఎప్పటి నుంచో ఉన్నా, అది బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు .ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడిన నలుగురు వైసిపి ఎమ్మెల్యేల్లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే.నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లను వైసిపి సస్పెండ్ చేసింది.

Advertisement

  ఇక ఇప్పుడు మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అసంతృప్తిని వెళ్ళ గక్కుతున్నరు.

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి( MLA Sai Prasad Reddy ) నేరుగా కాకుండా పరోక్షంగా తన అసంతృప్తిని వెళ్ళగకుతున్నారు.ముఖ్యమంత్రి గా జగన్ కు అనుభవం లేదని అంటూ రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తే ఆయనకు సంపూర్ణ అవగాహన కలుగుతుందంటూ వ్యాఖ్యానించారు .ఈ వ్యాఖ్యలను కొంతమంది అంతర్గతంగా సమర్ధించినా,  మరి కొంత మంది మాత్రం సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.అయితే తాను యాదాఫలంగా చేసిన వ్యాఖ్యలే ఇవి అంటూ సాయి ప్రసాద్ రెడ్డి సమర్ధించుకుంటున్నారు.

అసలు సాయి ప్రసాద్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడానికి కారణం ఆయనతో పాటు,  ఆయన సోదరులు ఇద్దరు ఎమ్మెల్యేలు గానే ఉన్నారు.సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని ఎమ్మెల్యేగా ఉండగా,  బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేగా, వెంకటరామిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.  ఈ ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మొదటి నుంచి ఆశగా ఎదురు చూస్తున్న , వీరికి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట.

ఆసంతృప్తితోనే సాయి ప్రసాద్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు