నా లక్ష్యం నెరవేరింది అంటున్న అదితీరావ్

చాలా మంది అందాల భామలు ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు.

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అవ్వాలని తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకోవాలని అనుకుంటారు.

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే నటిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పాత్రలు చేయాలని కొంత మంది కలలు కంటూ ఉంటారు.అయితే మోడలింగ్ లోకి వచ్చి సినిమా కెరియర్ ఎంచుకునే అందాల భామలు అందరికి అదృష్టం కలిసి రాదు.

Aditi Rao Hydari Fulfills Her Dreams, Tolluywood, Bollywood, South Heroines, Pan

హీరోయిన్ కావాలనే కోరికతో వచ్చిన వారిలో కొంత మందికి మాత్రమే స్టార్ హీరోయిన్ గా, కమర్షియల్ హీరోయిన్ గుర్తింపు వస్తుంది.కొంత మంది బెస్ట్ నటిగా ప్రశంసలు లభిస్తాయి.

ఇలా సక్సెస్ చూసే హీరోయిన్లు జాబితా చాలా తక్కువగా ఉంటుంది.ఇదిలా ఉంటే ఇలాంటి కలలు, ఆశలతో అదితీరావ్ హైదరీ కూడా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Advertisement

ఇక హైదరాబాదీ అమ్మాయి అయినా బాలీవుడ్ లో నటిగా ముందు కెరియర్ ప్రారంభించిన ఈ భామ తరువాత తమిళ్, తెలుగు సినిమాలలో కూడా నటించింది.మరో వైపు బాలీవుడ్ లో కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది.

అలాగే మలయాళీ, కన్నడ ఇండస్ట్రీలోకి కూడా అదితీరావ్ అడుగుపెట్టింది.ఇలా సౌత్ లో నాలుగు భాషలతో పాటు హిందీ సినిమాలు కవర్ చేస్తూ పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోయింది.

ప్రస్తుతం తెలుగులో ఈ భామ మహాసముద్రం సినిమాలో నటిస్తుంది.హిందీలో జాన్ అబ్రహంకి జోడీగా ఒక సినిమా చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరైనా నన్ను మీరు ప్యాన్‌ ఇండియన్‌ యాక్టర్‌ అని అంటే నాకు చాలా ఇష్టం.ఎందుకంటే నటిగా ప్రారంభం అయినప్పుడు ప్యాన్‌ ఇండియా యాక్టర్‌ అనిపించుకోవాలనే లక్ష్యంతో వచ్చాను.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

నటి కావాలని కలలు కన్నాను.అది నిజం చేసుకున్నాను.

Advertisement

కొన్నేళ్లుగా నా అభిమాన దర్శకులందరితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అని అదితీరావ్ తన మనసులోని మాటని బయటపెట్టింది.

తాజా వార్తలు