ఆదిపురుష్ సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్.. అఫిషియల్ అనౌన్స్!

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్( Adipurush ).

ప్రభాస్ హీరోగా, కృతి సనన్( Kriti Sanon ) హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ఇందులో ప్రభాస్ ( Prabhas )రాముడి పాత్రలో నటించగా.

కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.

సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.

ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ జై శ్రీరామ్ తో మరిన్ని అంచనాలు క్రియేట్ చేసి పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసారు.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇందు కోసం తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ సినిమా రిలీజ్ కు మరి కొద్దీ రోజులే ఉండగా మరో సాంగ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ను మే 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.రామ్ సియా రామ్ అనే సాంగ్ కోసం ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి మొదటి సాంగ్ ను మించి ఉంటుందో లేదో చూడాలి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఇక జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు