ఆ పుస్తకం అంటే ఎంతో ఇష్టమంటున్న శ్రియ..?

ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రియా సరన్.

గత రెండేళ్ల నుంచి హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా ఆమె నటించబోయే సినిమాలు హిట్ అయితే మాత్రం శ్రియ మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశం ఉంది.

పుస్తకాలు చదవడాన్ని ఎంతో ఇష్టపడే శ్రియ ది ఎనార్కి అనే పుస్తకాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.ఒక సందర్భంలో తనకు ఈ పుస్తకం అంటే ఎంతో ఇష్టమని శ్రియ చెప్పుకొచ్చారు.

మొఘల్ సామ్రాజ్యాన్ని ఈస్టిండియా కంపెనీ ఏ విధంగా మట్టి కరిపించిందనే అంశాలను ప్రస్తావించిన ఈ పుస్తకాన్ని విలియం డాల్‌ర్లింపుల్ రాశారు.ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యవాద శక్తిగా ఏ విధంగా మారిందనే అంశాలను కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు.

ప్లాసీ యుద్ధం తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ సంపన్న శక్తిగా ఎదగడం వెనుక గల కారణాలను కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.శ్రియ తనకు ది ఎనార్కి బుక్ ఇష్టమని చెప్పడంతో ఆమె అభిమానులు ఈ పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు.2018 సంవత్సరం మార్చి 12వ తేదీన ఆండ్రీ కొచ్చివ్ ను వివాహం చేసుకున్న శ్రియ భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.లాక్ డౌన్ సమయంలో శ్రియ భర్తతో ఇంటికి సంబంధించిన అన్ని పనులను చేయించారు.

Advertisement
Actress Shriya Sharan Favoruite Book Is The Anarchy,tollywood,sriya,intrested In

మరోవైపు సినిమాలతోను శ్రియ బిజీగా ఉన్నారు.

Actress Shriya Sharan Favoruite Book Is The Anarchy,tollywood,sriya,intrested In

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు గమనం అనే సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.పెళ్లి తర్వాత శ్రియకు సినిమా అవకాశాలు తగ్గగా ఆర్ఆర్ఆర్ రిలీజైన తరువాత ఆమె మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

అక్టోబర్ నెల 13వ తేదీన దసరా పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు