కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టారా?

హీరోయిన్ శ్రద్ధా ఆర్య.( Shraddha Arya ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రద్ధా.ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం కన్నడ హిందీ పంజాబీ సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు నేర్పరచుకుంది.

అన్ని భాషల్లో ఈమెకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది శ్రద్ధా ఆర్య.

ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి తన భర్తకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.కాగా 2004 లో టీవీ రియాల్టీ షోలో పాల్గొన్న ఈమె 2006లో కలవనిన్ కదలై అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయింది.ఆ తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించి మెప్పించింది.

Advertisement

గత ఏడాది రిలీజైన హిందీ మూవీ రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.వీటితో పాటు పలు సీరియల్స్‌ లో కూడా యాక్ట్ చేసింది.

ఇకపోతే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె 2021 లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగర్ ని( Rahul Nagar ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది.

ఇప్పుడు తనకు ఒక అబ్బాయి,అమ్మాయి పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంది.శ్రద్ధా ఆర్య కవలలకి( Twins ) జన్మనిచ్చింది.ఈ విషయాన్ని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.

నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిన విషయాన్ని బయటపెట్టింది.ఈ మేరకు ఇద్దరు బిడ్డలను చేతిలో పట్టుకుని వారి వైపు చూస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

బీట్ రూట్ జ్యూస్ త‌ల‌కు రాయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా?
అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై వర్మ సంచలన పోస్ట్.. మెగాబలి అంటూ కామెంట్స్!

ఆ ఫోటోని చూసిన అభిమానులు, నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు