అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన రష్మిక... ఫోటోలు వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రష్మిక( Rashmika )మందన్న ఒకరు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరి రష్మిక ఎవరు పెళ్లికి వెళ్లారు ఏంటి అనే విషయానికి వస్తే.

ఒక స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే వారికి ఒక పెద్ద టీమ్ఉం టుందనే విషయం మనకు తెలిసిందే.మేకప్ నుంచి మొదలుకొని అసిస్టెంట్ లు హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు ఒక టీం ఉంటారు.ఇక వీరందరిని సెలబ్రిటీలు తమ సొంత ఫ్యామిలీలాగే చూసుకుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే రష్మిక అసిస్టెంట్ సాయిబాబు ( Saibabu ) అనే వ్యక్తి వివాహం ఆదివారం హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రష్మికను ఆహ్వానించగా ఆమె ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.

ఈ విధంగా పెళ్లి వేదికపై రష్మిక వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.అయితే వధూవరులు ఉన్నఫలంగా రష్మిక కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకోబోగా రష్మికకు ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక కాస్త కంగారు పడ్డారు.అనంతరం వధూవరులను ఆమె ఆశీర్వదించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఈ వివాహ వేడుకలలో రష్మిక ఆరంజ్ రంగు శారీలో చాలా సింపుల్ గా స్టైలిష్ గా కనిపించారు.

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ), యానిమల్( Animal), రెయిన్ బో వంటి సినిమాలతో పాటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్( Shahid Kapoor ) అలాగే ధనుష్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు