మోహన్ బాబును చూడాలంటే భయం వేసేది.. ప్రేమ సంచలన వ్యాఖ్యలు?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ప్రేమ ఒక ఇంటర్య్వూలో మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించి ప్రేమ పాపులారిటీని పెంచుకున్నారు.

 Actress Prema Sensational Comments On Mohan Babu Goes Viral In Social Media Deta-TeluguStop.com

ఒకవైపు స్టార్ హీరోలకు మరోవైపు అంతగా క్రేజ్ లేని హీరోలకు జోడీగా నటించి ప్రేమ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

బెంగళూరులో జన్మించిన ప్రేమ తన సినీ కెరీర్ లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించి మెప్పించారు.2009 తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రేమ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రేమ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో నేను నటించానని ప్రేమ తెలిపారు.

Telugu Actress Prema, Mohan Babu, Prema, Prema Offers, Sensational-Movie

మోహన్ బాబుతో షూట్ అంటే టెన్షన్ గా ఉంటుందని షాట్ సరిగ్గా రాకపోతే ఆయన తిడతారని చాలామంది నటీనటులు చెబుతుంటారు.మోహన్ బాబుతో షూట్ అంటే చాలా భయపడ్డానని ఆమె కామెంట్లు చేశారు.మోహన్ బాబు గురించి గతంలో నేను విన్న విషయాల వల్ల నాకు భయం కలిగిందని ఆమె అన్నారు.

Telugu Actress Prema, Mohan Babu, Prema, Prema Offers, Sensational-Movie

మోహన్ బాబు గారితో నటించడం సులువు కాదని అయితే రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఏకంగా నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించానని ప్రేమ పేర్కొన్నారు.మోహన్ బాబుకు పోటీగా నేను నటించానని ఆయనను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడాలంటే భయం వేసేదని ప్రేమ చెప్పుకొచ్చారు.ప్రేమ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.ప్రేమకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube