ప్రభాస్ తో చేసిన సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది: కృతి సనన్

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నెంబర్ వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి కృతి సనన్ ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు పొందలేదు.ఈ సినిమా అనంతరం మరో రెండు చిత్రాల్లో నటించి తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు.

 Actress Kriti Sanon Interesting Comments About Prabhas Adipurush In Iifa 2022 Aw-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ అగ్రతారగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరొగేట్ మదర్ పాత్రలో కృతిసనన్ నటించిన మిమి చిత్రానికి విశేషమైన స్పందన లభించింది.

తాజాగా ‘ఐఫా 2022’లో కృతి సనన్‌ మిమి సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.ఈ విధంగా మొట్టమొదటిసారిగా ఉత్తమ నటి అవార్డు అందుకున్న కృతిసనన్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా నాకు ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.ఈ సినిమా కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా జ్యూరీ సభ్యులను కూడా ఆకట్టుకొని నాకు ఈ అవార్డు అందించింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Kritisanoni, Kritisanonsita, Mimi, Nenok

ఇలా మొట్టమొదటిసారిగా ఉత్తమనటి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈమె తన ఆనందాన్ని బయటపెట్టారు.ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నారు.రామాయణం ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు.ఈ సినిమా గురించి కృతి సనన్ మాట్లాడుతూ ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమా తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube