సీనియర్ నటీమణులలో ఒకరైన కవిత ( kavitha )గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కవిత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించగా కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఒక సినిమా షూటింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కవిత కీలక వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
నేను పేర్లు చెప్పను కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character artist ) నా పొట్ట మీద చెయ్యి పెట్టి కవితకు పొట్ట లేదయ్యా అందుకే సన్నగా కనిపిస్తుంది అని అన్నారని కవిత కామెంట్లు చేశారు.
నేను చాలా ఇరిటేట్ అయిపోయి బాగా తిట్టానని ఆమె చెప్పుకొచ్చారు.నన్ను ముట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముందని కవిత పేర్కొన్నారు.నాకు పెళ్లై పిల్లలున్నారని నన్ను ముట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.

నేను చాలా ఇరిటేషన్ గా ఉన్నానని ఇలా చేయడం నాకు నచ్చలేదని చెప్పానని కవిత పేర్కొన్నారు.రీఎంట్రీలో నాకు అంత కోపం వచ్చిందని కవిత కామెంట్లు చేశారు.మా అమ్మ లేనప్పుడు నేను చాలా వెధవ పనులు చేశానని చీపురుకట్ట తిరిగేసిన రోజులు కూడా ఉన్నాయని ఆమె అన్నారు.
ఇరవై ఫీట్స్ నుంచి కిందికి దూకానని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఆ సీన్ చేసే సమయంలో మా అమ్మ వచ్చిందని కవిత అన్నారు.

ఆ సమయంలో కేఎస్ రెడ్డి( KS Reddy ) గారు ఫస్ట్ కొట్టారని ఆమె కామెంట్లు చేశారు.ఇప్పుడు బంధిపోటు రుద్రమ్మ సినిమా చూస్తే ఆ షాట్ చూడొచ్చని కవిత తెలిపారు.కవిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కవిత వరుస సినిమాల్లో నటించి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







