సినీ ఇండస్ట్రీలో నటిగా చాలా తక్కువ సినిమాలలో హీరోయిన్ గా నటించి అనంతరం ఇండస్ట్రీకి దూరం అయినటువంటి వారిలో నటి కస్తూరి శంకర్ (Kasturi Shankar) ఒకరు.హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించారు.
ఈమె సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చాలా తక్కువ సమయం కొనసాగారని తెలుస్తుంది.ఇక పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైనటువంటి కస్తూరి శంకర్ ప్రస్తుతం మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఒకవైపు బుల్లితెర సీరియల్స్ చేయడమే కాకుండా మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruha Lakshmi) సీరియల్లో తులసి పాత్రలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి కూడా స్పందిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు.ఇలా కస్తూరి శంకర్ తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉంటారు.
ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కస్తూరి శంకర్ తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీ( Cinema Industry ) అంటే ఎన్నో రకాల రూమర్స్ ఉంటాయనే సంగతి మనకు తెలిసిందేఒక సినిమాలో హీరో హీరోయిన్స్ నటించిన వారిద్దరు తిరిగి మరొక సినిమాలో నటించిన వారి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తుంటాయి అలాగే అవకాశాల కోసం ఫలానా ప్రొడ్యూసర్ డైరెక్టర్ తో కమిట్ అయ్యారంటూ కూడా సెలబ్రిటీల గురించి వార్తలు రావడం సర్వసాధారణం.
ఇలాంటి వార్తలలో నిజం లేకపోయినా సెలబ్రిటీల గురించి రూమర్లు వినపడుతూనే ఉంటాయి.ఈ క్రమంలోనే కస్తూరి శంకర్ హీరోయిన్గా కొనసాగే సమయంలో ఆమె ప్రొడ్యూసర్ తో( Producer ) కమిట్ అయ్యారు అంటూ ఒక డర్టీ రూమర్ వెలుగులోకి వచ్చిందని తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన గురించి ఇలాంటి రూమర్ రావడంతో ఒక్కసారిగా తన తండ్రి చాలా భయపడ్డారట
ఇలాంటి రూమర్ నీ గురించి వినపడుతుంటే నీకు పెళ్లి( Marriage ) చేయడం చాలా కష్టం నీకు పెళ్లి చేసే బాధ్యత మాపై ఉంది అందుకే పెళ్లి చేసుకో అంటూ వెంటనే నాకు పెళ్లి చేసేసారని ఈ సందర్భంగా కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.23 సంవత్సరాలకి నాకు పెళ్లి జరిగిందని అయితే పెళ్లి తర్వాత నేను వరల్డ్ లో 25 దేశాలు తిరుగుతూ అన్ని ఎంజాయ్ చేశానని అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశాను అంటూ ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తెలిపారు.