జగన్ కరోనా టెస్టింగ్ పై పంచ్ వేసిన సీనియర్ హీరోయిన్ కస్తూరి

ఎక్కువగా వివాదాస్పద వాఖ్యలు చేస్తూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఒకప్పటి సౌత్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సామాజిక అంశాలపై స్పందిస్తూ వాటి మీద సెటైరికల్ కామెంట్స్ చేస్తుంది.

ఎవరో ఒకరిని విమర్శించడంలో ఈమె ముందు ఉంటుంది.ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలలో కూడా ఆమె వాఖ్యలు ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.

Actress Kasturi Punch On Jagan Corona Testing, Tollywood, AP Politics, Corona Ef

ప్రస్తుతం ఈ ముదురు భామ తెలుగులో గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తుంది.ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఓ సీరియల్ హీరోయిన్ సెటైర్లు వేసింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన కరోనా టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు.అయితే, అందులో జగన్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది.

Advertisement

ఈ విషయాన్ని ధన్య రాజేంద్రన్అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.ఆ ఫొస్ట్‌‌ను సీరియల్ నటి కస్తూరి శంకర్ కామెంట్ చేసింది.

అందులో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ పనిచేసినట్టున్నాయి అంటూ పంచ్ వేస్తూ పోస్ట్ చేసింది.అయితే కస్తూరి చేసిన ఈ కామెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో వైసీపీ కార్యకర్తలకి కోపం తెప్పిస్తే, విపక్షాలకి ఆసక్తికరంగా మారింది.

దీంతో వాళ్ళు ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు.వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు