ప్రముఖ నటి జమున ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ సినీ నటి జమున వెండితెర సత్యభామగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న జమున ఎన్నో సినిమాలలో విలక్షణమైన పాత్రలలో నటించి ఆ పాత్రలలో తనను తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం.

తెలుగింటి సత్యభామ ఎవరనే ప్రశ్నకు తెలుగు సినీ ప్రేక్షకులు ఎవరైనా వెంటనే జమున పేరును సమాధానంగా చెబుతారు.పదుల సంఖ్యలో సినిమాలలో సావిత్రికి చెల్లి పాత్రలో జమున నటించి మెప్పించారు.

అలనాటి స్టార్ హీరోలందరికీ జోడీగా జమున నటించడం గమనార్హం.ఎన్టీఆర్, ఏఎన్నార్ జమునకు అవకాశాలు ఇవ్వని సమయంలో కూడా ఆమె 18 సినిమాలలో నటించారంటే ఆమె స్థాయి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

వినాయక చవితి అనే సినిమాలో తొలిసారి సత్యభామ రోల్ లో నటించి జమున మెప్పించడం గమనార్హం.శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో కూడా జమున సత్యభామ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.జమున నటిగా భారీ స్థాయిలోనే ఆస్తులు కూడబెట్టారు.

Advertisement

జమున ఆస్తుల విలువ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.ఆమెకు జూబ్లీహిల్స్ లో ఖరీదైన భవంతి ఉంది.

ఈ భవంతి 2000 గజాలు ఉందని సమాచారం అందుతోంది.కొండాపూర్ లో ఒక ఫ్లాట్ తో పాటు ఈమెకు పాత బంగ్లా కూడా ఉంది.జమున చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

జమున పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా తన తప్పు ఉంటే ఆమె క్షమాపణలు చెప్పేవారు.జమున భర్త పేరు రమణారావు కాగా ఈ దంపతులకు వంశీ, స్రవంతి జన్మించారు.

కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు