Fatima Babu: నటిని అలాంటి విషయాలు అడిగిన నెటిజెన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నటి?

తెలుగు ప్రేక్షకులకు నటి ఫాతిమా బాబు( Fatima Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సీరియల్స్ తో పాటు సినిమాలలో కూడా నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Actress Fathima Babu Serious Reply To Follower-TeluguStop.com

కాగా ఈమె తెలుగులో నవదీప్‌( Navdeep ) హీరోగా వచ్చిన గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ సినిమాలో అతడికి తల్లిగా నటించింది.ఆ తర్వాత కథానాయకుడు సినిమాలో నటించింది.

ఆ తర్వాత తెలుగు సినిమాలలో కనిపించలేదు.తరువాత తమిళంలో డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Face, Fathima Babu, Netizen, Reply-Movie

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె కేవలం సీరియల్స్ లో మాత్రమే నటిస్తోంది.కాగా ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో కొన్ని స్క్రీన్‌ షాట్ ఫోటోలను షేర్‌ చేసింది.ఆ ఫోటోలని శారీ చేస్తూ ఒక నెటిజన్ తప్పుడు ప్రశ్నలు వేసి తనను ఇబ్బంది పెట్టాడని ఆమె తెలిపింది.అసలేం జరిగింది అంటే.

ఫాతిమా బాబు కొన్నేళ్ల క్రితం ఒక హిందువును పెళ్లి చేసుకున్నారు.

Telugu Face, Fathima Babu, Netizen, Reply-Movie

వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.ఈ ఇద్దరికీ ఆమె ముస్లిం పేర్లను పెట్టారు.ఇదే విషయాన్ని ఒక నెటిజన్‌ ఆమెను అడిగాడు.

దీంతో ఆమెకు కోపం వచ్చింది.ఆమె స్పందిస్తూ.

మీరు మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు.ఎలాంటి కండోమ్‌ వాడతామో కూడా అడుగుతారా? మీరు చర్చించుకోవటానికి మా పర్సనల్‌ విషయాలే దొరికాయా? ప్రతీ దానికి ఓ హద్దు ఉంటుంది.అవతలి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా మాట్లాడాలి అంటూ నెటిజెన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది ఫాతిమా బాబు.కాగా ఆ స్క్రీన్ షాట్ ఫోటోలు పై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఫాతిమా బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube