బుల్లితెర నటికి క్యాన్సర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్!

నటి ఛవి మిట్టల్.ఈమె గురించి ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ హిందీ సీరియల్స్ ని ఫాలో అయ్యే వారికి ఈమె బాగా సుపరిచితమే.

హిందీ సీరియల్ లో నటించిన నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పాపులారిటీని సంపాదించుకుంది ఛవి మిట్టల్.ఈమె ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు వెండితెరపై ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది.

ఇదిలా ఉంటే ఛవి మిట్టల్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ ఉందట.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈమె తన ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా తరచుగా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఇటీవల జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా ఛవి మిట్టల్ గాయపడింది.

Advertisement

అయితే వెంటనే ఆమె డాక్టర్లను సంప్రదించగా రొమ్ము లో కణతి ఉందని గుర్తించారు.అనంతరం పరీక్షలు నిర్వహించగా ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అయితే త్వరలోనే ఆమె సర్జరీ చేయించుకోనుందట.ఇకపోతే మామూలుగా క్యాన్సర్ బారిన పడితే చాలామంది భయపడుతూ ఉంటారు.

వారికి ఏమవుతుందో అని అనుక్షణం టెన్షన్ పడుతూ వారిలో వారే మదనపడుతూ ఉంటారు.కానీ ఛవి మిట్టల్ మాత్రం ఆమెకు క్యాన్సర్ ఉంది అని తెలిసినప్పటినుంచి తనలా క్యాన్సర్ తో బాధపడుతున్న ఎంతో మందికి క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తోంది.

అంతేకాకుండా తనకు క్యాన్సర్ ఉంది అన్న విషయాన్ని చెబుతూ ఎమోషనల్ గా పోస్ట్ కూడా చేసింది.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.డియర్ బ్రెస్ట్స్.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు

ఇది మీకు అభినందనలు పోస్ట్.నీ మ్యాజిక్ ఏంటో మీరు నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చినప్పుడు నేను తొలిసారి గమనించాను.

Advertisement

ఈరోజు మీలో ఒకరు క్యాన్సర్ తో పోరాడిన అప్పుడు మీకు అండగా ఉండడం నా వంతు.అయితే ఇలా జరగటం గొప్ప ఏమి కాదు కానీ విచారించాల్సిన అవసరం లేదు ఇది సులభమైనది కాదు,అలా అని కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు.

నేను మళ్లీ అదే విధంగా కనిపించకపోవచ్చు అంటూ సోషల్ మీడియాలో కాస్త ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడి గెలిచిన వారందరూ నుంచి నేను ఎంత పూర్తి ని పొందుతున్నాను మీకు తెలియదు.

అదేవిధంగా మీలో ఇప్పటికే తెలిసీ తెలియని వారికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు చేసే ప్రతి కాల్ కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపింది.

తాజా వార్తలు