పక్కా హైదరాబాదీని అంటున్న అమ్రిన్ ఖురేషి

ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో కంటే ముందుగా బాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యి తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఏపీ నుంచి గతంలో గద్దె సిందూర అనే అమ్మాయి బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ సినిమాలు చేసింది.

తరువాత శోభిత దూళిపాళ్ల కూడా అలాగే బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అయ్యింది.వీరు మాత్రమే మాకుండా గతంలో వహీదా రెహమాన్ కూడా హైదరాబాద్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్ అయ్యింది.

Actress Amrin Qureshi Is Thrilled To Be In Hyderabad, Tollywood, Bollywood, Hyde

తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సక్సెస్ అయ్యింది.ఇప్పుడు వీరి దారిలో మరో హైదరాబాదీ ముద్దుగుమ్మ అమ్రిన్ ఖురేషి కూడా బాలీవుడ్ కి వెళ్లి వరుసగా రెండు సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

బడా ప్రొడ్యూసర్ షాజిద్ ఖురేషి కూతురైన ఈ భామ తండ్రి నిర్మిస్తున్న బాలీవుడ్ మూవీలో నటిస్తుంది.ఇది సినిమా చూపిస్తా మామా రీమేక్ మూవీ కావడం విశేషం.

Advertisement

నెక్స్ట్ సినిమా కూడా జులాయి రీమేక్ లో నటించబోతుంది.ఈ రెండు సినిమాలో అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ వెటరన్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు నముషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇందులో ఒక సినిమా రాజ్ కుమార్ సంతోషి లాంటి స్టార్ దర్శకుడు తెరకెక్కిస్తూ ఉండటం విశేషం.ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమ్రిన్ ఖురేషి మీడియాతో ముచ్చటించింది.

తన ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ లోనే జరిగిందని.తరువాత ముంబైలో యాక్టింగ్ శిక్షణ కోసం జాయిన్ అయ్యి అనుకోకుండా అవకాశం సొంతం చేసుకున్న అని చెప్పింది.

తాను పక్కా హైదరాబాదీ అని సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం తన లక్ష్యం అని చెబుతుంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు