రోజు లేవగానే ఆలియా భట్ చేసే పని ఇదే!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

హిందీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో అవకాశాలతో బాగా బిజీగా మారింది.ఇదిలా ఉంటే తను రోజు ఉదయం లేవగానే చేసే పని గురించి అభిమానులతో పంచుకుంది.

Bollywood Actress Alia Bhatt Early Morning Workouts, Bollywood Actress Alia Bhat
Advertisement
Bollywood Actress Alia Bhatt Early Morning Workouts, Bollywood Actress Alia Bhat

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఆలియా భట్.నిత్యం తన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.ఈ మధ్య తన శరీరంపై బాగా దృష్టి పెట్టింది.

తెగ వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.కెరీర్ మొదట్లో కాస్త లావుగా ఉన్న ఆలియా భట్ రాను రాను తన శరీరాన్ని నాజుగ్గా మార్చుకుంటుంది.

నిత్యం యోగాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

Bollywood Actress Alia Bhatt Early Morning Workouts, Bollywood Actress Alia Bhat

అందం విషయంలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇక తను ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటో అభిమానులకు తెలిపింది.తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

అందులో కొన్ని విషయాలు పంచుకుంటూ.తను రోజు ఉదయం లేవగానే యోగా చేస్తుందట.

Advertisement

అలా చేయడం వల్ల తను ఆరోగ్యంగా ఉంటానని తెలిపింది.పలు రకాల యోగాసనాలు చేసి ఆ తర్వాతే తన పనులేంటో చూసుకుంటానని తెలిపింది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

తాజా వార్తలు