భలే ఉందే.. అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ?

ఒకప్పుడు టాలీవుడ్ నటీనటులు టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యేవారు.ఇక బాలీవుడ్ వారు బాలీవుడ్ లోనే ఉండేవారు.

కానీ ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు భాష పరిధిని ప్రాంత పరిధిని పూర్తిగా చెరిపే సాయి.దీంతో బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అక్కడి వారు ఇక్కడ ఇక్కడ వారు అక్కడ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఎక్కడ నటిస్తే ఏంటి ప్రేక్షకులను అలరించడం ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉన్నారు .ఈ క్రమంలోనే ఇటీవలే అటు బాలీవుడ్లో ఎంతో మంది సౌత్ యాక్టర్స్ కనిపిస్తూ ఉంటే ఇక టాలీవుడ్ లో కూడా ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్ కీలక పాత్రలో నటిస్తుండడం చూస్తూ ఉన్నాం.ఈ క్రమంలోనే ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవ్ గన్ ఆలియా భట్ కనిపించారు.

కే జి ఎఫ్ సినిమాలో సంజయ్ దత్ కూడా తన నటనతో మెప్పించాడు.ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేరుగా బరిలోకి దిగి ఒక కీలక పాత్రలో నటించేందుకు సిద్దమయ్యాడు.

Advertisement

ఇక ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమాలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారు.ఇలా బాలీవుడ్ నటులు అందరూ కూడా అటు టాలీవుడ్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండడం గమనార్హం.

అదే సమయంలో ఇక టాలీవుడ్ హీరోలు సైతం బాలీవుడ్ హీరోల సినిమాలో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం ఏకంగా టాలీవుడ్ వెంకీ మామ ఒక బాలీవుడ్ ప్రపోజల్ కి ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది.సల్మాన్ ఖాన్ నటిస్తున్న కబి ఈద్ కబి దీవాలి సినిమాలో ఒక ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించబోతున్నాడట విక్టరీ వెంకటేష్.

ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత అటు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వెంకటేష్.ఇక ఇందులో విలన్ గా జగపతిబాబు పేరు కూడా వినిపిస్తోంది.అదే సమయంలో అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంటారు నాగార్జున.

అయితే ఇప్పుడు బ్రహ్మాస్త్రతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్నారు.ఇక తండ్రి కంటే ముందు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు లాల్ సింగ్ చద్దా తో సిద్ధమయ్యాడు నాగచైతన్య.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు