రాజమౌళి చేతిలో పడి హీరో నుండి స్టార్ హీరోగా మారిన నటులు

జ‌క్క‌న్న చేతిలో ప‌డి శిల శిల్పంగా మారిన‌ట్లు.ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్నతో సినిమాలు చేసిన ఏ హీరో అయినా హిట్ కొట్టాల్సిందే! అంద‌నంత ఎత్తుకు ఎద‌గాల్సిందే! టాలీవుడ్ లో ఓట‌మే ఎర‌గ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి.

స్టూడెంట్ నెం.1తో సినిమా ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన రాజ‌మౌళి.బాహుబ‌లి సినిమాతో దేశంలోనే టాప్ డైరెక్ట‌ర్ స్థానాన్ని పొందాడు.

ఆయ‌న సినిమాలో కంటెంట్, టేకింగ్, యాక్ష‌న్స్ సీన్స్, హీరో ఎంట్రీ, విల‌న్ క్యారెక్ట‌ర్.అన్నీ ఫ‌ర్ఫెక్ట్ గా ఉంటాయి.

అందుకే త‌ను రూపొందించిన‌ సినిమాలు ఓట‌మంటూ ఎర‌గ‌వు.త‌న‌తో సినిమాలు చేసిన హీరోలంతా బిగ్గెస్ట్ హిట్లు అందుకున్నారు.

ప్ర‌స్తుతం టాప్ హీరోలుగా కోన‌సాగుతున్నారు.ఇంత‌కీ జ‌క్క‌న్న‌తో సినిమాలు చేసి.

Advertisement
Actors Became Stars After A Movie With Rajamouli , Ss Rajamouli, Rajamouli Movie

అద్భుత హీరోగా ఎదిగిన న‌టులు ఎవ‌రు? వారు చేసిన సినిమాలు ఏంటి? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.నాని

Actors Became Stars After A Movie With Rajamouli , Ss Rajamouli, Rajamouli Movie

సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌లు సినిమాలు చేసినా.నానికి రాజ‌మౌళి సినిమాతో మంచి గుర్తింపు వ‌చ్చింది.2012లో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఈగ అనే సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాతో నానికి అప్ప‌టి వ‌ర‌కు లేని బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో ప‌డింది.నితిన్

Actors Became Stars After A Movie With Rajamouli , Ss Rajamouli, Rajamouli Movie

జ‌యం లాంటి చ‌క్క‌టి చిత్రాలు తీసి మంచి గుర్తింపు పొందిన నితిన్ జ‌క్క‌న్న‌తో సినిమా చేసి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.వీరిద్ద‌రు క‌లిసి సై సినిమా చేశారు.నితిన్ ను హీరోగా అంద‌నంత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా సై.జూనియ‌ర్ ఎన్టీఆర్

Actors Became Stars After A Movie With Rajamouli , Ss Rajamouli, Rajamouli Movie

వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో 2003లో వ‌చ్చిన సినిమా సింహాద్రి.ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ను టాప్ హీరో స్థాయికి తీసుకెళ్లింది.ప్ర‌భాస్

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

ఈశ్వ‌ర్ స‌హా ప‌లు సినిమాలు చేసిన ప్ర‌భాస్ కు జ‌క్క‌న్న తొలిసారి ఇచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఛ‌త్ర‌ప‌తి.ప్ర‌భాస్ ను సూప‌ర్ మాస్ హీరోగా ఈ సినిమా నిల‌బెట్టింది.రాంచ‌ర‌ణ్

Advertisement

మెగాస్టార్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రాంచ‌ర‌ణ్ చిరుత సినిమాతో మంచి హిట్ కొట్టాడు.ఆ త‌ర్వాత రాజ‌మౌళితో క‌లిసి మ‌గ‌ధీర సినిమా చేశాడు.యంగ్ హీరోగా ఇండ‌స్ట్రీ హిట్ సాధించాడు.ర‌వితేజ‌

2006లో రవితేజ‌తో క‌లిసి రాజ‌మౌళి విక్ర‌మార్కుడు అనే సినిమా తీశాడు.ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాసింది.సునీల్

సునీల్ లాంటి క‌మెడియ‌న్ తో క‌లిసి మ‌ర్యాద రామ‌న్న అనే సినిమా తీశాడు రాజ‌మౌళి.2010లో విడుద‌ల అయిన ఈ సినిమా సునీల్ ను ఓ రేంజికి తీసుకెళ్లింది.సునీల్ సినీ కెరీర్ లో మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు రాజ‌మౌళి.

తాజా వార్తలు