విరాటపర్వం ఉద్యమమే కాదు.. గొప్ప ప్రేమ కథ.. నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం.

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని జూన్ 17వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.ఇకపోతే ఈ సినిమాలో నటుడు నవీన్ చంద్ర కీలక పాత్రలో పోషించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోందని ప్రశ్నించగా ఆయన తన పాత్ర గురించి ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేశారు.

ఇప్పటివరకు తాను నటించిన సినిమాలు అన్నింటిలోనూ కథలో చిన్న మార్పు తేవడం లేదా కథలో ట్విస్ట్ ఇవ్వడం వంటి పాత్రలో నటించాను.అయితే విరాటపర్వం సినిమా ఆ సినిమాలన్నింటికీ ఎంతో భిన్నం.

Advertisement

ఇందులో నేను సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలు కనిపిస్తాను.నా పాత్ర సినిమా కథ మొత్తం తలకిందులుగా చేస్తేలా ఉంటుంది.

ఈ సినిమాలో తాను ఉద్యమం తప్ప మరే దేనిని లెక్కచేయని తన పాత్ర అలా ఉండబోతుందని నవీన్ చంద్ర ఈ సందర్భంగా వెల్లడించారు.అయితే ఈ సినిమాలో ఉద్యమం మాత్రమే కాకుండా, గొప్ప ప్రేమకథ కూడా ఉందని,ఈ సినిమాలో తన పాత్ర దాదాపు 35 నిమిషాల పాటు ఉంటుందని నవీన్ చంద్ర వెల్లడించారు.ఈ సినిమా ద్వారా డైరెక్టర్ వేణు కొత్త ప్రయోగం చేశారని సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని నవీన్ చంద్ర ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు