కన్నకూతురును చదివించలేని స్థితిలో ప్రముఖ నటుడు.. ఏమైందంటే..?

దేశంలో ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా కరోనా వైరస్ విజృంభణ వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి.

ఇతర రంగాలతో పోలిస్తే సినిమా రంగంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.

కరోనా, లాక్ డౌన్ నిబంధనలు పెద్ద నటులపై ప్రభావం చూపకపోయినా చిన్న నటులపై మాత్రం తీవ్ర ప్రభావం చూపాయి.కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంతమంది నటులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

ప్రముఖ నటులలో ఒకరైన జావేద్ హైదర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం ఈ నటుడు తన కూతురును కూడా చదివించుకోలేని స్థితిలో ఉన్నారని సమాచారం.

ఒక ఇంటర్వ్యూలో జావేద్ హైదర్ మాట్లాడుతూ తన కూతురు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోందని కూతురుకు నెలకు ఫీజు 2,500 రూపాయలు కాగా ఇబ్బందుల వల్ల జావేద్ హైదర్ మూడు నెలల ఫీజును చెల్లించలేకపోయారు.ఫీజు చెల్లించకపోవడంతో తన కూతురును ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించారని జావేద్ హైదర్ చెప్పుకొచ్చారు.

Advertisement

స్కూల్ మేనేజ్ మెంట్ తో మాట్లాడినా సానుకూలంగా స్పందించలేదని ఆ తరువాత చాలా కష్టపడి ఫీజు చెల్లించగా అప్పుడు మాత్రమే తనను ఆన్ లైన్ క్లాసులకు అనుమతించారని జావేద్ హైదర్ పేర్కొన్నారు.ఇండస్ట్రీకి చెందిన వాళ్లను డబ్బు అడగడం తనకు సిగ్గుచేటుగా ఉంటుందని జావేద్ హైదర్ వెల్లడించారు.

ఇతరుల దగ్గర డబ్బు కోసం చేయి చాస్తే అందరూ చులకనగా చూస్తారని జావేద్ హైదర్ చెప్పుకొచ్చారు.డబ్బు గురించి సహాయం ఆర్థిస్తే ఛాన్స్ ఇవ్వడానికి సినిమా రంగంలో అస్సలు ఇష్టపడరని జావేద్ హైదర్ వెల్లడించారు.డబ్బులు అవసరమైతే భార్య నగలు తాకట్టు పెట్టడం లేదా స్నేహితుల దగ్గర చేయి చాచటం చేయాలని జావేద్ హైదర్ చెప్పుకొచ్చారు.

యాడోన్ కీ భారత్ సినిమాతో జావేద్ హైదర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించడం గమనార్హం.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు