కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ధనుష్ ( Danush ) కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగారు.ఇక ఈయన తెలుగు భాష చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ధనుష్ నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా నిర్మాతగా డైరెక్టర్ గా పనిచేశారు.ఇలా ఈయన సినిమాల విషయంలో మల్టీ టాలెంట్ అని చెప్పాలి ఇకపోతే ఇప్పటికే 50 సినిమాలను పూర్తి చేసుకున్నటువంటి ధనుష్ 51వ సినిమాని కూడా ప్రకటించారు.
ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాని పూర్తి చేసినటువంటి ధనుష్ ప్రస్తుతం 50వ సినిమా షూటింగ్ పనులలో ఉన్నారు.త్వరలోనే శేఖర్ కమ్ముల ( Sekhar Kammula ) దర్శకత్వంలో 51వ సినిమాలో బిజీ కానున్నారు.

ఈయన నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇకపోతే ధనుష్ వండర్ బాల్ ఫిలిం సంస్థ ( Wonder Ball films ) నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే ఈ నిర్మాణ సంస్థలో ధనుష్ ఇప్పటివరకు 14 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.ఇక ఈయన చివరిగా 2018 వ సంవత్సరంలో మారి 2 సినిమా చిత్రాన్ని నిర్మించారు.
దాదాపు 5 సంవత్సరాలపాటు ఈయన నిర్మాతగా సినిమాలకు దూరమయ్యారు.ఇలా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నటువంటి ధనుష్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

ఇకపోతే దాదాపు 5 సంవత్సరాలు తర్వాత మరోసారి ఈయన నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.ధనుష్ వండర్ బాల్ ఫిలిం సంస్థలో 15వ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తుంది.ఇందులో ధనుష్ హీరోగా నటించబోతున్నట్లు ప్రకటించారు.ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు.అదేవిధంగా కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తో కూడా ఈయన మరో సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించే సినిమాలు ధనుష్ కి జోడిగా రష్మిక నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.







