కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ( Actor Daniel Balaji ) తాజాగా కన్నుమూసిన విషయం తెలిసిందే.శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ( Heart Attack ) ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.కానీ మార్గ మధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.కొందరు ఇప్పటికే ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మెప్పించిన బాలాజీ ఇక లేరు మరణించారు అనే వార్తని అటు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఆయన చనిపోయినప్పటికీ ఇద్దరు జీవితాలలో వెలుగులు నింపి మంచి జీవితాన్ని అందించారు.
డేనియల్ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని( Eye Donation ) ముందే నిర్ణయించుకున్నాడు.మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలని తలచాడు.అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు.ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.ఇప్పుడు ఆయన మరణం తర్వాత డేనియల్ బాలాజీ నేత్రాలను( Daniel Balaji Eyes ) అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు తోడ్పడుతున్నారు.
డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేయడంతో అందుకు సంబంధించిన ఆపరేషన్ పూర్తి అయిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు.అనంతరం మృతదేహాన్ని తన స్వగృహానికి తరలించనున్నారు.తిరువాన్మియూర్‌లోని ఆయన నివాసంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎంతో మందిని బతికేలా చేస్తున్న మంచి హృదయం ఉన్న డేనియల్ బాలాజీ అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.