బబ్లూ పృథ్వీరాజ్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బబ్లూ పృథ్వీరాజ్ ఆ తర్వాత తెలుగులో విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలలో అంతగా నటించడం లేదు.
బబ్లూ పృథ్వీరాజ్ సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బబ్లూ పృథ్వీరాజ్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.
పృథ్వీరాజ్ తన భార్యతో కొన్ని విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని బబ్లూ పృథ్వీరాజ్ రెండవ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే వీరి వివాహం చాలా సీక్రెట్ గా జరిగిందని.
పృథ్విరాజ్ ప్రస్తుతం ఆ 23 ఏళ్ల మలేషియా అమ్మాయితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయం గురించి త్వరలోనే కారికంగా బబ్లూ పృథ్వీరాజ్ వెల్లడించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే 57 ఏళ్ల పృధ్విరాజ్ కు మొదట్లో బీనా అనే ఒక మహిళతో పెళ్లయిన విషయం తెలిసిందే.

వారికి ఒక బాబు కూడా పుట్టాడు.అయితే బబ్లూ పృథ్వీరాజ్, బీనా దంపతులకు ఒక గానక కొడుకు అహద్.కానీ అహద్ ఆటిజంతో బాధపడుతున్నారట.
దాని కారణంగా అహద్ ఎవరితో మాట్లాడాలి కలవ డానికి కూడా ఇష్టపడడట.వాడి ప్రపంచంలో వాడు సంతోషంగా ఉంటాడు.
ప్రస్తుతం అతనికి 27 ఏళ్లు.ఇప్పుడు బాగా ఉన్నాడు అని బాగా అర్థం చేసుకుంటున్నాడు కానీ మాట రాదు అని చెప్పుకొచ్చాడు బబ్లూ పృథ్వీరాజ్.







