Cvl Narasimha Rao : పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏపీకి జరిగేది ఇదే.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో మరొకవైపు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Actor Advocate Cvl Narasimha Rao About Pawan Kalyan-TeluguStop.com

అయితే మొన్నటి వరకు అటు సినిమాలపై రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టుకి కొద్దిరోజుల ముందు నుంచి పూర్తిస్థాయిలో పాలిటిక్స్ పైన దృష్టి పెట్టారు.మరొకవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు మూడు సినిమాలను కమిట్ అవ్వగా అందులో కొన్ని ఇప్పటికి కొంతమేరకు షూటింగ్ కూడా జరుపుకున్నాయి.

అందులో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, పిఎస్ పీకే 29 సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Ap, Balakrishna, Cvl Simha Rao, Jana Sena, Pawan Kalyan, Tollywood-Movie

అలాగే ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ విషయానికి వస్తే.మొన్నటికి వరకు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ఉంటుంది అంటూ అనేక రకాల వార్తలు వినిపించగా చంద్రబాబు అరెస్టు సమయంలో ఆ పొత్తు విషయాన్ని పవన్ కళ్యాణ్ కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలోని పలు జిల్లా తను సందర్శిస్తూ ఒక్క అవకాశం ఇవ్వమంటూ ప్రజలను వేడుకుంటున్నారు.ఏపీ సీఎం అవ్వాలి అని పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అయితే ఏం జరుగుతుంది అన్న విషయం గురించి టాలీవుడ్ ప్రముఖ నటుడు ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా నటుడు సివిఎల్ నరసింహారావు( Cvl Narasimha Rao) మాట్లాడుతూ.

Telugu Ap, Balakrishna, Cvl Simha Rao, Jana Sena, Pawan Kalyan, Tollywood-Movie

మా బిల్డింగ్ కడతామని ఎప్పటినుంచో అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ మా బిల్డింగ్ కట్టే విషయంలో అనేక రకాల ఆలోచనలు తలెత్తుతున్నాయి.ఎందుకంటే తెలంగాణమాలో మా బిల్డింగ్ కడితే మరి ఏపీలో పరిస్థితి ఏంటి అక్కడ వారికి సమస్యలు వస్తే పక్క రాష్ట్రానికి రావాల్సిందే కదా.ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయినారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో మాకు బిల్డింగ్ నిర్మిస్తారు.అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు వెంటనే యాంకర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అయ్యారు అని ఆయన మాటలు నమ్మి వెళ్లాలి అంటారా లేక పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హీరో కాబట్టి ఆయనను నమ్మి వెళ్లాలంటారా అని ప్రశ్నించగా.రాష్ట్రం విడిపోయింది కాబట్టి వెళ్ళాలి.

బాలకృష్ణ గారు హిందూపూర్, రోజా గారు నగరి కాబట్టి ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ నియోజకవర్గంలో కూడా చేసుకోవాలి కదా.కాబట్టి మా బిల్డింగ్ అన్నది కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో కూడా నిర్మించాలి.తెలంగాణలో బిల్డింగ్ కడితే ఏపీలో కనీసం రెండు బెడ్ రూమ్లు అయినా ఉండాలి కదా అంటూ మా బిల్డింగ్ విషయంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు నరసింహారావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube