సమంత కి స్కూల్ కి వెళ్లినట్టు అనిపించిందట

ధనుష్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న హీరో ధనుష్.

కేవలం దక్షిణాదిలోనే కాకుండా, బాలివుడ్ లో కుడా మంచి నటుడన్న గౌరవం దక్కించుకున్నాడు.అక్కడ చేసిన రాంఝానా, శమితాబ్ చిత్రాలతో అందరి ప్రశంసలు పొందాడు ధనుష్.

అమితాబ్ లాంటి మహానటుడే, ధనుష్ తో పోటిపడి నటించడం కష్టం అన్నప్పుడు ఇక మిగితావారు ఎంత ! ఇదే అనుభవం సమంతకి జరిగింది.ధనుష్ - సమంత నటించిన తంగ మగన్ ( తెలుగులో నవమన్మధుడు ).ఈ చిత్రం యొక్క అనుభవాలను సమంత మీడియా తో పంచుకుంటూ " ధనుష్ తో నటించడం చాలా కష్టమైనా విషయం.తన నుంచి చాలా నేర్చుకోవచ్చు.

తనతో నటిస్తున్నంత సేపు నేను నటన నేర్చుకోవడానికి స్కూల్ కి వెళ్తున్నాను ఏమో అనిపించింది.నేను సాధారణంగా నా కను బొమ్మలను ఎక్కువగా కదిలిస్తుంటాను.

Advertisement

అది సహజంగా అనిపించదు.పాత్ర కోసం నా కనుబోమ్మలను ఎక్కువగా కదిలించకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాను, నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను.

ఈ సినిమాలో నా పాత్ర అంత సహజంగా ఉంటుంది.నాకు ఏంతో ఇష్టమైన సినిమా ఇది, అలాగే ఇష్టపడి చేసిన పాత్ర ఇది " అంటూ ధనుష్ ని పోగిడేసింది సమంత.

Advertisement

తాజా వార్తలు