'మేము 42 శాతం టాక్స్ కడుతున్నాం.. ప్రభుత్వాన్ని అడిగితే తప్పేంటీ'.. చిరు కామెంట్స్!

ప్రెసెంట్ టాలీవుడ్ లో ఆచార్య మ్యానియా నడుస్తుంది.చిరంజీవి, రామ్ చరణ్ కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.చిరు, చరణ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేస్తూన్నారు మేకర్స్.దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.

Advertisement

ఈ వరుస అప్డేట్ లు కూడా మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.అలాగే ఈ సినిమా మరో మూడు రోజుల్లో రానున్న క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగింది.

ఈ ఈవెంట్ లో చిరు ను మీడియా వారు.చిరు సినిమా అంటేనే హౌస్ ఫుల్ అవుతాయి.

ఇక టికెట్ పెంచడం ఎందుకు అని అడిగారు.దీనికి చిరు మాట్లాడుతూ.

కరోనా పాండమిక్ తర్వాత సినిమా పరిశ్రమ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంది.వడ్డీకే 50 కోట్లు కొట్టారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఇంత డబ్బు కట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా.ఎవరిస్తారు చెప్పండి.

Advertisement

సర్కారు వారు కనికరించి జీవోలు ఇస్తే మనకి వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక 10 రూపాయలు ఇద్దాం అని ప్రేక్షకులు కూడా అనుకుంటారు.

ఇది అడుక్కు తినడం ఎలా అవుతుంది.వినోదాన్ని అందించే ప్రయత్నంలో వడ్డీలు ఎక్కువ అయ్యాయి.వడ్డీనే ఎక్కువ అనుకుంటే మేము టాక్స్ కూడా 42 శాతం కడుతున్నాం.

అందులో కొద్దిగా తిరిగి ఇవ్వండి అంటూ అడగడంలో తప్పు ఏమీ లేదు.తప్పు అని కూడా నేను అనుకోవడం లేదు.

అని చెప్పుకొచ్చారు.ప్రెసెంట్ ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తాజా వార్తలు