ఆచార్య కాపీ కాదు...మాదే అంటున్న టీమ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగష్టు 22) సందర్భంగా కొరటాల-మెగాస్టార్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడం తో ఈ చిత్రం పై హోప్స్ కూడా బాగా పెరిగిపోయాయి.

అంతా బాగుంది అనుకుంటే ఈ చిత్ర కధ తమదే అంటూ కొన్ని వార్తలు రావడం తో ఆ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ సంస్థ తాజాగా స్పందించింది.ఆచార్య చిత్ర కధ అనేది డైరెక్టర్ కొరటాల శివ రాసుకున్న సొంత కధ అని, ఆచార్య కథ తమదంటూ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టం చేసింది.

సినిమా కథ ను కావాలనే గోప్యంగా ఉంచుతున్నామని, కొందరికి మాత్రమే అసలు కథ తెలుసునని నిర్మాణ సంస్థ వెల్లడించింది.ఈ కథ మాదే అంటూ ఎవరు వచ్చినా పట్టించుకోనవసరం లేదు అంటూ వెల్లడించింది.

సామాజిక సమస్యల నేపథ్యంలో చిత్రాలను తెరకెక్కించి భారీ హిట్ లు కొట్టే దర్సకుడిగా కొరటాల కు ఇండస్ట్రీ లో మంచి పేరుంది.అలాంటి దర్శకుడి డైరక్షన్ లో చిరు హీరోగా చేస్తున్న ఈ చిత్రం పై అందరి అంచనాలు పెరిగిపోయాయి.

Acharya Movie Story Is Not Copy Says Movie Team,koratala Siva,megastar Chiranjee
Advertisement
Acharya Movie Story Is Not Copy Says Movie Team,Koratala Siva,Megastar Chiranjee

అయితే అలాంటి ఈ చిత్రం పై ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం సరైనది కాదని నిర్మాణ సంస్థ అభిప్రాయపడింది.ప్రస్తుతం సెట్స్ పైనే ఉన్న ఈ చిత్రం వీలైనంత త్వరలోనే షూటింగ్ ను ముగించుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ నిర్మాణ సంస్థ తెలిపింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు