లాల్ సింగ్ ప్లాప్ నుండి అమీర్ బయటపడలేక పోతున్నాడా..?

బాలీవుడ్ లో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ కు మళ్ళీ నిరాశనే ఎదురైంది.

 Aamir Khan Into Shock After Laal Singh Chaddha Failure Details, Kareena Kapoor ,-TeluguStop.com

కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ అందుకుంటూ వందల కోట్లను వసూలు చేస్తుంటే.

బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు.

దీంతో బాలీవుడ్ లో పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.ఈ మధ్య కాలంలో అక్కడ రెండెంకెల ఓపెనింగ్స్ తేవడమే గగనం అయిపోయింది.20 కోట్ల ఓపెనింగ్స్ కూడా తేలేక చేతులెత్తేస్తున్నాయి.ఈసారి కూడా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా పూర్తిగా నిరాశ పరిచింది.

ఈ సినిమా నాలుగు రోజుల్లో కేవలం 38 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఇది అమీర్ ఖాన్ స్టార్ డమ్ కు ఆ మాత్రం సరిపోదు.

దీంతో అమీర్ ఖాన్ షాక్ కు గురి అయ్యాడని స్వయంగా అక్కడి ముంబై మీడియా వార్తలు ప్రచురిస్తుంది.ఈ సినిమా భారీ డిజాస్టర్ దిశగా సాగుతుందని దీంతో అమీర్ ఖాన్ షాక్ నుండి బయటకు రాలేక పోతున్నాడు అంటూ వరుస కథనాలు వస్తున్నాయి.

మోస్ట్ ఏవైటెడ్ సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ ప్లాప్ అందుకోవడంతో విమర్శలు ఎదురవుతున్నాయి.

Telugu Aamir Khan, Bollywood, Kareena Kapoor, Laalsigh, Laalsingh, Naga Chaitany

ఇక ఈ సినిమా వైఫల్యానికి భారీ మూల్యం కూడా చెల్లించక తప్పడం లేదు.ఎందుకంటే ఈ సినిమాను అమీర్ ఖాన్ అతడి మాజీ భార్య నిర్మించారు.కానీ పెట్టిన భారీ బడ్జెట్ కు తిరిగి కొంత కూడా రాబట్టలేక పోతుంది.

ఈ భారీ ప్లాప్తో బయ్యర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా కథనాలు వస్తున్నాయి.అమీర్ ఖాన్ కూడా వారికీ నష్టం రాకుండా కొంతమేర చెల్లించ డానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

కానీ ఈ ప్లాప్ ను అమీర్ ఖాన్ ఇప్పటికి జీర్ణించు కోలేక పోతున్నాడని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube