ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రత్యామ్నాయమా ?

దేశ రాజకీయాలను శాసించే పార్టీలు ఏవైనా ఉన్నాయా ? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పేర్లు తప్పా, ఇంకా వేరే పార్టీలు కనిచూపు మెరలో కనిపించాయి.

దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు మాత్రమే దేశ వ్యాప్తంగా ఏలుతున్నాయి.

అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి.ప్రాంతీయ పార్టీలు కూడా దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

అయితే ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ జాతీయ పార్టీగా విస్తరించడం అంత తేలికైన విషయం కాదు.ఇప్పటివరకు ఎన్నో పార్టీలు జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నాయి.

Aam Aadmi Party Is An Alternative ,aam Aadmi Party , Arvind Kejriwal , Bjp, Cong

ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్( Trinamool Congress ), ఎన్సీపీ, సిపిఐ వంటి పార్టీలు జాతీయ స్థాయిలో విస్తరించాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాయి.కానీ ఫలితాలు మాత్రం శూన్యం.ఇక తాజాగా ఈ పార్టీలకు జాతీయ హోదా ను కూడా రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Advertisement
Aam Aadmi Party Is An Alternative ,Aam Aadmi Party , Arvind Kejriwal , Bjp, Cong

అయితే తక్కువ టైమ్ లోనే కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) నేషనల్ పార్టీగా విస్తరిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసురుతోంది.డిల్లీలో ప్రారంభమైన అప్ హవా ఆ తరువాత పంజాబ్ కు విస్తరించడంతో పాటు అధికారాన్ని కూడా చేజిక్కించుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఆ తరువాత యూపీ, గుజరాత్, గోవా ఎలక్షన్స్ లో ఆప్ సత్తా చాటింది.దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీనే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Aam Aadmi Party Is An Alternative ,aam Aadmi Party , Arvind Kejriwal , Bjp, Cong

ఇక తాజాగా గోవా, గుజరాత్, పంజాబ్ ఎన్నికల ఆధారంగా ఆప్ కు జాతీయ పార్టీ హోదా ను కూడా కట్టబెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆప్ ను మరింత విస్తరించేందుకు సిద్దమౌతున్నారు ఆప్ నేతలు.ఇక వచ్చే నెలలో జరగనున్న కర్నాటక ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపిస్తే.దక్షిణాదిలో కూడా విస్తరించే అవకాశం ఉంది.మొత్తానికి ఆప్ దూకుడుతో ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ లు ఉలిక్కిపాటుకు గురౌతున్నాయనే చెప్పాలి.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఈ రెండు పార్టీలపైనా దేశ ప్రజల్లో ఏమాత్రం అవిశ్వాసం పెరిగిన అది ఆమ్ ఆద్మీ కి మరింత అనుకూలంగా మారుతుంది.దేశ ప్రజలు కూడా ఆప్ వైపే చూసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

మరి ఆమ్ ఆద్మీ జోరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు