'బ్లాక్' టీజర్ వచ్చేసింది.. పోలీస్ డ్రెస్ లో అదరగొట్టిన ఆది !

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించు కున్నాడు ఆది సాయికుమార్.

మొదటి రెండు సినిమాలు మంచి హిట్ కొట్టి ఆ తర్వాత కొద్దిగా తడబడిన ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.

ప్రస్తుతం కేవలం తన కెరీర్ పైనే ద్రుష్టి పెట్టాడు ఆది.ఆయన కొత్తగా బ్లాక్ సినిమా చేస్తున్నాడు.ఇందులో మొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు.

తాజాగా బ్లాక్ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఆది చాలా కష్టపడుతున్నాడు.

పోలీస్ యూనిఫామ్ లో తన తండ్రిని గుర్తు చేస్తున్నాడు ఆది.మొదటి సారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఆది డేరింగ్ అండ్ డాషింగ్ లుక్ లో చంపేస్తున్నాడు.ఇప్పటికే బ్లాక్ సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ కూడా విడుదల చేసి ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసాడు.

Advertisement

తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.హీరో సుధీర్ బాబు ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కు విషెష్ తెలిపాడు.ఈ టీజర్ ఆది డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది.

కంటికి కనిపించని కాలయముడు.ఊహించని కపట నేత్రంతో పద్మ వ్యూహంలోకి నెట్టాడు.

అనే డైలాగ్ తో ఆది ఆకట్టుకున్నాడు.

ఇది ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే సినిమాగా టీజర్ ను చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమాలో దర్శన బానిక్ హీరోయిన్ గా కనిపిస్తుంది.ఈ సినిమాను జిబి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ముఖంపై ఎలాంటి మ‌చ్చ‌లున్నా మాయం చేసే మ్యాజిక‌ల్‌ రెమెడీ మీకోసం!

మహంకాళి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మరి చూడాలి తండ్రికి కలిసొచ్చిన పోలీస్ డ్రెస్ తనయుడికి ఎంత బాగా వర్క్ అవుట్ అవుతుందో.

Advertisement
https://youtu.be/zlkd_ksA5Wk

తాజా వార్తలు