సిగ్గులేని కుటుంబాలు అంటూ భారతీయులపై ఓ మహిళ జాత్యహంకార కామెంట్స్!

ఒక విదేశీ మహిళ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విషయం ఏంటంటే, ఆ మహిళ భారతీయ కుటుంబాలు(Female Indian families) పబ్లిక్‌గా ప్రవర్తించే తీరుపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

దాంతో నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చ మొదలుపెట్టారు.కొందరు ఆమె మాటలకు వత్తాసు పలుకుతుంటే, మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలు మరీ శృతిమించినట్టు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు.

మొత్తానికి ఈ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు దారితీశాయి.వివరాల్లోకి వెళితే, సదరు మహిళ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

అందులో "భారతీయ కుటుంబాలు పబ్లిక్‌గా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు.మీకు మంచి ప్లేస్ ఉంటే చాలు, మిమ్మల్ని అక్కడి నుంచి లేపేయాలని చూస్తారు.

Advertisement

మరీ ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, మ్యూజియమ్‌లలో క్యూ లైన్‌లో (Queues at airports and museums)సిగ్గులేకుండా దూరిపోతారు." అంటూ తన గోడు వెళ్లబోసుకుంది.

ఇంకేముంది, తన బాధను ఇంతటితో ఆపకుండా, ఇంకో పోస్ట్ కూడా వేసింది."ఇలాంటివి ఎవరైనా గమనించారా?" అంటూ మిగతా వాళ్లను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.ఆ తర్వాత పారిస్‌లో జరిగిందంటూ ఒక స్టోరీ కూడా చెప్పింది.

అక్కడ ఒక భారతీయ కుటుంబం క్యూ లైన్‌లో దూరిపోతుంటే, ఒక పొడవైన అమెరికన్ వ్యక్తి గట్టిగా అరిచాడట.అప్పుడు ఆ ఫ్యామిలీకి ఇంగ్లీష్ రానట్టూ, వినపడనట్టూ యాక్టింగ్ చేశారంటూ చెప్పుకొచ్చింది.

ఆమె కామెంట్స్ పెట్టిందో లేదో, క్షణాల్లో వైరల్ అయిపోయాయి.ఇక సోషల్ మీడియా వేదికగా జనాలు ఓ రేంజ్‌లో డిస్కషన్ పెట్టుకున్నారు.చాలా మంది ఆమె కామెంట్స్‌ను తప్పుబడుతూ, అవి పక్షపాతంతో కూడినవని, అన్యాయమని తిట్టిపోశారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఒక యూజర్ అయితే, "ప్రతి సంస్కృతిలోనూ బ్యాడ్ గా ప్రవర్తించేవాళ్లు ఉంటారు.కానీ ఒక దేశం మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదు" అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

Advertisement

మరో యూజర్ అయితే ఇంకొంచెం ఘాటుగా స్పందించాడు."వేరే దేశాల వాళ్లు క్యూ లైన్‌లో దూరిపోవడం లేదా? మంచి ప్లేస్ కోసం ఎగబడటం లేదా?" అంటూ నిలదీశాడు.కొందరు ట్రావెలర్స్ అయితే ఆమె చెప్పిన దానికి పూర్తిగా డిఫరెంట్‌గా రెస్పాండ్ అయ్యారు.

"నేను చాలా దేశాలు తిరిగాను.కానీ భారతీయులు అలా ప్రవర్తించడం ఎప్పుడూ చూడలేదు.

బహుశా మీకున్న కొన్ని చేదు అనుభవాలే మిమ్మల్ని ఇలా మాట్లాడేలా చేస్తున్నాయేమో?" అంటూ ఆమెకే క్లాస్ పీకారు.ఇంకొందరు నెటిజన్లు ఆమె ఇండియన్ ఫ్యామిలీస్‌ను "యాంటీ సోషల్" అనడంపైనే ఫైర్ అయ్యారు.

ఒక యూజర్, "భారతీయ కుటుంబాలు ఎంత కలివిడిగా ఉంటారో అందరికీ తెలుసు.వాళ్లను యాంటీ సోషల్ అనడం ఏంటి?" అంటూ లాజికల్ క్వశ్చన్ వేశాడు.చాలా మంది ఆమెను జాత్యహంకారి అంటూ ముద్ర వేశారు.

ఒకరైతే, "నీకు ఏదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చెప్పు.కానీ ఒక దేశం మొత్తాన్ని తప్పు పట్టకు" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

అయితే, కొందరు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు."ఆమెకు ఒక పద్ధతి కనిపించింది కాబట్టే మాట్లాడింది.అంతే కానీ ప్రతి ఒపీనియన్ జాత్యహంకారం కాదు" అంటూ ఆమె వాదనను సమర్థించారు.

మరికొందరు ఇంకొంచెం కొత్త పాయింట్ తీసుకొచ్చారు."ఇది యాంటీ సోషల్ బిహేవియర్ కాదు.

కలెక్టివిస్ట్ కల్చర్స్ లో రూల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.అక్కడ వ్యక్తిగత లాభానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.

ఇది రూడ్ నెస్ కాదు, వాళ్ల కల్చర్ అంతే." అంటూ కొత్త కోణం చూపించారు.

ఏది ఏమైనా, ఈ డిబేట్ మాత్రం ఇంకా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది.

తాజా వార్తలు