ఒకప్పుడు ప్రజల దాహం తీర్చిన నీటి ట్యాంక్...!

నల్లగొండ జిల్లా: గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 20 ఏళ్ల క్రితం నీటి ట్యాంకును నిర్మించారు.

కానీ,ప్రస్తుతం ప్రతి ఇంటికి కృష్ణా నీటిని సరఫరా చేస్తుండడంతో నీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది.

అప్పుడు గ్రామంగా ఉన్న గట్టుప్పల్ ఈ మధ్య కాలంలో కొత్త మండలకేంద్రంగా ఏర్పాటై వాహనాల రద్దీ పెరిగింది.వృథాగా ఉన్న నీటి ట్యాంకు పక్కనే పెట్రోల్ బంక్ రావడంతో ఒకవైపు నుండి వచ్చే వాహనాలకు మరోవైపు వాహనాలు కనిపించకుండా అడ్డుగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదకరంగా మారిన ఈ నీటి ట్యాంకును తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని,రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారిన ఈ నీటి ట్యాంకును వెంటనే తొలగించాలని వాహనదారులు,స్థానికులు కోరుతున్నారు.

మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ
Advertisement

Latest Nalgonda News