వైజాగ్‌లో జగన్‌ పార్టీ చేస్తున్న పనిపై వాట్సాప్‌లో వైరల్‌ అయిన పోస్ట్‌

రాజధానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి కమిటీ వేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు.

ఆ కమిటీ మరో వారం, పది రోజుల్లో సుదీర్ఘ నివేదిక ఇస్తుందనీ ఆయనే వెల్లడించారు.

కానీ అదే సమయంలో కమిటీ సూచనలు ఏంటో తెలియక ముందే ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని సూత్రప్రాయంగా ప్రకటించారు.

A Viral Post On Whatsapp About What Jagans Party Is Doing In Vizag

ఆయనే తుది నిర్ణయం తీసుకుంటే ఇక కమిటీ ఎందుకన్న విమర్శలను జగన్‌ ఎలాగూ పట్టించుకోరు.అది వేరే సంగతి.అయితే అసెంబ్లీలో జగన్ ఇప్పుడు ప్రకటించారుగానీ.

క్షేత్ర స్థాయిలో పని ఎప్పుడో ప్రారంభమైనట్లు తాజాగా ఓ వాట్సాప్‌ పోస్ట్‌ సంచలన విషయాన్ని వెల్లడిస్తోంది.అంతేకాదు వైసీపీలోని అత్యంత ముఖ్యమైన నలుగురైదుగురికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదని సమాచారం.

Advertisement
A Viral Post On Whatsapp About What Jagans Party Is Doing In Vizag-వైజా

వైరల్‌గా మారిన ఆ వాట్సాప్‌ పోస్ట్‌ ప్రకారం జగన్‌ ప్రకటించినట్లుగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది.దీనికోసం తగిన స్థలం, భవనాల సేకరణ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.

రెండు వేల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించారు.అంతేకాదు ఈ మధ్యే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఖాళీ చేసిన రెండున్నర లక్షల చదరపు అడుగుల స్థలమున్న భవనాన్ని తాత్కాలికంగా పరిపాలన విభాగం కోసం వాడనున్నారు.

A Viral Post On Whatsapp About What Jagans Party Is Doing In Vizag

ఈ భవనం విజయవాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారిది.ఇక ఆంధ్రా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న మరికొన్ని భవనాలను కూడా దీనికోసం గుర్తించారు.భీమిలి దగ్గర్లో సముద్ర తీరాన మూడు ఎకరాల స్థలంలో ఉన్న ఓ భవనం ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కార్యనిర్వాహక వర్గాన్ని గరిష్ఠంగా మరో మూడు, నాలుగు నెలల్లో వైజాగ్‌కు తరలించే అవకాశం ఉందని ఆ వాట్సాప్‌ సందేశం స్పష్టం చేస్తోంది.గవర్నర్‌ నివాసం కోసం శాశ్వత భవనం ఏర్పాటు చేసే వరకూ తాత్కాలికంగా సిరిపురంలోని సర్క్యూట్‌ హౌజ్‌ను రాజ్‌భవన్‌గా వాడనున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ పని ఎప్పటి నుంచో ప్రారంభమైనా ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచారు.వైసీపీలోని చాలా కొద్ది మంది ముఖ్యులు మాత్రమే ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు