ఉక్కు సంకల్పానికి వెయ్యి రోజులు పూర్తి !

విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ప్రైవేటీ కరణ కు వ్యతిరేకం గా కార్మిక సంఘాలు తలపెట్టిన ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుంది .విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో మలిదశ ఉద్యమం మొదలుపెట్టిన కార్మిక సంఘాలు గత వెయ్యి రోజులుగా వివిధ రూపాల్లో తమ ఆందోళనలు ప్రదర్శిస్తూనే ఉన్నాయి .

 A Thousand Days Of Vizag Steel Hesitation , Visakha Steel Plant, Nirmala Sithar-TeluguStop.com

జనవరి 27 2021 న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ( Nirmala Sitharaman )100% ప్రైవేటీ కరణ అనౌన్స్ చేయగానే మొదలైన ఈ ఉద్యమాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.వివిద కార్మిక సంఘాలు ఉమ్మడిగా కార్యాచరణను ప్రకటించాయి.

రహదారి ద్వారా వస్తే అడ్డుకుంటారని హెలికాఫ్టర్ లో వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన టీం లను ఉద్యోగులంతా సంఘటితమై ప్రతిఘటించడంతో వాల్యుయేషన్ ఆగిపోయింది.దాంతో బిడ్డింగ్ ప్రక్రియ ఆలస్యమైంది.

ఈలోపు రాజకీయంగా మద్దతు కూడగట్టడానికి వివిధ రాజకీయ పార్టీలను కలిసిన కార్మిక సంఘాలు ఆ మేరకు వారి నుంచి మద్దతును అయితే సంపాదించగలగారు కానీ అవి వాస్తవం రూపం దాల్చలేదు.

Telugu Amit Shah, Prime Modi, Visakha Steel-Telugu Political News

కార్మిక సంఘాల ప్రతినిధులను ప్రధాని మోది( Prime Minister Modi ) దగ్గరికి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ కూడా ఆచరణలో సాధ్యం కాలేదు విశాఖలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన హోమ్ మినిస్టర్ అమిత్ షా( Amit Shah ) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర వెనక్కి తగ్గేవరకు తమ ఉద్యమాలను కొనసాగిస్తామంటూ చెప్పుకోస్తున్నాయి.

Telugu Amit Shah, Prime Modi, Visakha Steel-Telugu Political News

అయితే ప్రజా ఉద్యమాలను ప్రభుత్వాలు పట్టించుకునే రోజులు ఎప్పుడో దాటిపోయాయి.పూర్తిస్థాయి రాజకీయ చైతన్యం వస్తే తప్ప ప్రభుత్వాలు వెనకడుగు వేసే పరిస్థితులు లేవు .దాంతో ప్రజలు సంఘటితమై రాజకీయ పక్షాలపై ఈ దిశగా ఒత్తిడి ని తీవ్రతరం చేస్తే తప్ప స్టీల్ పాయింట్ ప్రైవేటీకరణ ఆగడానికి అవకాశాలు లేదని నిపుణులు వాఖ్యనిస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube