ముడతలను మాయం చేసి ముఖ చర్మాన్ని యవ్వనంగా మార్చే సింపుల్ చిట్కా మీకోసం!

ఇటీవల రోజుల్లో చాలా మంది తక్కువ వయసులోనే ముడతల సమస్యను( Wrinkle problem ) ఎదుర్కొంటున్నారు.

ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, పోషకాల కొరత, ఒత్తిడి తదితర అంశాలు ఇందుకు కారణాలుగా మారుతుంటాయి.

ఏదేమైనా సరే ముడతలు వచ్చాయంటే ముసలి వారిగా కనిపిస్తుంటారు.అందం పాడవుతుంది.

అందుకే ముడ‌త‌ల‌ను నివారించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.అయితే వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే ముడతలు మాయం అవ్వడమే కాదు మీ ముఖ చర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక క్యారెట్ ( Carrot )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో కడిగి సన్నగా తరుముకోవాలి.

Advertisement
A Simple Tip To Get Rid Of Wrinkles And Make Your Skin Look Younger, Wrinkles, Y

ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చసొన ( Egg yolk )వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు క్యారెట్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( raw milk), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

A Simple Tip To Get Rid Of Wrinkles And Make Your Skin Look Younger, Wrinkles, Y

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు ఒకటికి రెండుసార్లు బాగా అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజ‌ర్ ను రాసుకోవాలి.

A Simple Tip To Get Rid Of Wrinkles And Make Your Skin Look Younger, Wrinkles, Y

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే ముడతలు మాయం అవుతాయి.సాగిన చర్మం బిగుతుగా మారుతుంది.ముఖం యవ్వనంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.వయసు పైబడిన వృద్ధాప్య ల‌క్ష‌ణాలు త్వరగా ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Advertisement

కాబట్టి యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు