ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ ( Salar )సినిమాలో ప్రభాస్ చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ యాక్షన్ సీన్స్ ని డీల్ చేశాడు.ముఖ్యంగా సినిమా మొత్తాన్ని చూస్తే ఆయన మాట్లాడింది కేవలం ఒక అయిదారు సార్లు మాత్రమే ఉంటుంది అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఆయన గురించి పక్కనున్న క్యారెక్టర్లు పృధ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) గాని,మిగితా క్యారెక్టర్లు గానీ ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు.

అంతే తప్ప ఆయన మాత్రం ఎక్కువగా మాట్లాడాడు ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ అలా డైలాగులు ఎక్కువగా లేని క్యారెక్టర్ ని ఎలా ఒప్పుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా ప్రశాంత్ నీల్ చిన్న యాక్షన్ ఎపిసోడ్ ని కూడా డిజైన్ చేశాడు.దానికి ప్రభాస్ విజిల్ కూడా కొడతాడు.
ఇక వీటన్నింటినీ సినిమాలో పెట్టడం వల్ల మెయిన్ హీరో మీద అటెన్షన్ అనేది తగ్గిపోతుంది అనే దృష్టిలో మిగతా హీరోలు అందరూ భావిస్తూ ఉంటారు.అందుకే వాళ్ల ఒక్క క్యారెక్టర్ కే ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు.

కానీ అక్కడుంది ప్రభాస్ కాబట్టి డైరెక్టర్ ఏమనుకుంటే దాన్ని యాజ్ ఇట్ ఇస్ స్క్రీన్ మీద చూపించండి అని వాళ్లకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తాడు కాబట్టే ప్రభాస్ హీరోగా ఉన్నప్పటికీ సినిమాలో కీలక పాత్రల్లో నటించే వాళ్ళని కూడా ఎలివేట్ చేయడానికి డైరెక్టర్ కి ఒక ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది.అందుకే ప్రభాస్ సినిమా అంటే డైరెక్టర్లు చాలా ఫ్రీగా వర్క్ చేస్తూ ఉంటారని వాళ్ళే చాలాసార్లు చెప్పారు…ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది….