చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే చింతే వద్దు.. ఈ చిట్కాను పాటించండి!

చుండ్రు.ప్రస్తుత చలికాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.

పొడి గాలి, తక్కువ తేమ కారణంగా తలపై చుండ్రు ఎక్కువగా వృద్ధి చెందుతుంది.

అలాగే వేడి వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల స్కాల్ప్ మీద సహజ నూనెలు తగ్గిపోతాయి.

దాంతో చుండ్రు సమస్య ఏర్పడుతుంది.కారణం ఏదైన‌ప్పటికీ చుండ్రు తీవ్రమైన చికాకును కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.అయితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే చింతే వద్దు.

Advertisement

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ చిట్కా కనుక పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా చుండ్రును వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటి.? అనేది తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కప్పు ఫ్రెష్ వేపాకులను తీసుకుని మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న వేపాకుల పేస్ట్ నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేపాకుల జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

వారంలో రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే చుండ్రు అన్నమాట అనరు.చాలా వేగంగా చుండ్రు మాయమవుతుంది.తల శుభ్రంగా మారుతుంది.

Advertisement

తరచూ ఈ చిట్కాను పాటిస్తే చూడు మళ్ళీ మళ్ళీ రాకుండా సైతం ఉంటుంది.చుండ్రు సమస్యతో మదన పడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ పవర్ ఫుల్ చిట్కా పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు