వట్టి చేతులతో పెద్ద పాముని తీసి పక్కన పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్!

సాధారణంగా రాత్రిపూట ఏదైనా రహదారిలో వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు పాము కనిపిస్తే చాలు గుండె ఆగినంత పనవుతుంది.

వెంటనే బ్రేక్ వేసి భయపడిపోతూ అది పోయేంత వరకూ చాలా మంది వెయిట్ చేస్తారు.

కానీ కొందరు మాత్రం ధైర్యం చేసి ముందుకు వెళ్తారు.మరికొందరైతే ఏకంగా ఆ పాములతో ఆడుకుంటారు.

అలాంటి ధైర్యవంతులు చాలా అరుదుగా ఉంటారని చెప్పవచ్చు.అయితే తాజాగా అలాంటి ధైర్యవంతుడి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు "వామ్మో ఈ డ్రైవర్ గుండె మామూలుది కాదు.భయం అనే పదం ఈ సాహసి డిక్షనరీలో లేనట్లుంది" అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు అప్పట్నుంచి ఇది వైరల్ గా మారింది.ఈ వీడియోలో బస్సు డ్రైవర్ రోడ్డుపై అడ్డంగా నిలిచిపోయిన ఒక కొండచిలువ తలని పట్టుకొని పక్కన పడేసాడు.

ఈ మనిషి ఆ పాము తల ఎక్కడ ఉందో దూరం నుంచే పరిశీలించాడు.అనంతరం ఆ పామును పట్టుకుని వేగంగా పక్కకు జరిపాడు.

అయితే అతడి ధైర్యానికి ఆగిపోయిన ఆ పాము పొదల్లో పడి పరుగు లంకించుకుంది.ఈ పెద్ద పాము తలుచుకుంటే అతన్ని చంపగలదు.

అందుకే వద్దు, వద్దు అది చాలా డేంజర్ అని బస్సులో ఉన్న వారు భయంతో అరుస్తూనే ఉన్నారు.కాగా ఒక వ్యక్తి దీనిని వీడియో తీశాడు.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
చూపు లేకపోయినా 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతి.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే, ఈ సాహసమైన చర్య నెటిజన్లను షాక్‌కి గురిచేస్తోంది.వామ్మో ఏంటి ఇతని ధైర్యం అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు."వన్యప్రాణుల ఆవాసాలలోకి వెళ్లడం & వాటికి ఇబ్బంది కలిగించడం ఏం బాగోలేదు.

Advertisement

రోడ్డు ప్రమాదాల నుంచి జంతువులను ఎంతకని, ఎవరు కాపాడుతారు? అన్నట్లు ప్రవీణ్ పేర్కొన్నారు.వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి అంటూ కూడా అడిగారు.

ఈ వీడియో దక్షిణ భారతదేశంలోని ఒక అభయారణ్యంలో తీసి ఉండొచ్చని ఆయన తెలియజేశారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు