చెంపపై కొట్టి తర్వాత ముద్దు పెట్టేసింది.. క్యూట్ వీడియో వైరల్

చిన్నతనంలో స్కూలులో చిన్న పిల్లల మధ్య ఉండే స్నేహాలు చాలా బాగుంటాయి.ముఖ్యంగా పసితనంలో వారు చేసే అల్లరి చాలా అమాయకంగా ముద్దు వచ్చేలా ఉంటుంది.

 A Little Girl Kissing Boy Cute Vidoe Viral Deails, Kids Playing, Viral Latest, N-TeluguStop.com

అప్పుడే కొట్టుకోవడం, అప్పుడే కలిసి పోవడం వంటి చిన్న పిల్లల మధ్య ఉంటాయి.కల్లాకపటం ఎరుగకుండా, కల్మషాలు లేని వారి స్నేహం అందరినీ ఆకట్టుకుంటుంది.

వీటిని చూసిన పెద్ద వాళ్లకు కూడా తాము తిరిగి బాల్యంలోకి వెళ్లిపోతే చాలా బాగుంటుందని ఆశిస్తుంటారు.బాల్య దశలో ఎన్నో మరుపురాని గుర్తులు ఉంటాయి.

చిన్నారులకు సంబంధించిన ఎన్నో క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్లను బాగా అలరిస్తోంది.

దాని గురించి తెలుసుకుందాం.

స్కూలులో చిన్నారులంతా ఓ బెంచిపై కూర్చుంటారు.అక్కడ అంతా ఐదేళ్లలోపు చిన్నారులే.వారిలో ఓ అబ్బాయిని అతడి పక్కన కూర్చున్న అమ్మాయి బాగా విసిగిస్తుంది.

పదే పదే బాలుడిని ఆ చిన్నారి మోచేతితో కొడుతుంది.అంతే కాకుండా బాలుడి చెంపపైనా, నెత్తిపైనా పదే పదే కొడుతుంది.

బాలుడు ఆ అమ్మాయిని హెచ్చరిస్తాడు.కుదురుగా ఉండాలని, విసిగించొద్దని ఆ బాలికకు సూచిస్తాడు.

అంతేకాకుండా ఆ బాలిక చెప్పిన మాటను వినకుండా పదే పదే విసిగిస్తుంది.

ఓ వైపు బాలుడిని కొడుతూ విసిగిస్తూనే, బుగ్గపై ముద్దులు పెడుతుంది.ఈ వీడియోను moskva_kairumdyylyk అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.ఈ చిన్నారుల మధ్య గొడవ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ క్యూట్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కుతున్నాయి.సోషల్ మీడియాలో బాగా ఇది వైరల్ గా మారింది.

బాల్యంలో ఉండే ఇలాంటి గొడవలు భలే నవ్విస్తాయని, ఈ చిన్నారుల గొడవ భలే ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube