ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో( Dantewada ) జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.అయితే మావోయిస్టులు ఓ సొరంగం ( Tunnel ) కూడా వచ్చారని భద్రతా బలగాలు గుర్తించాయి.
గాజా టన్నెల్ తరహాలో మావోయిస్టులు భారీ సొరంగాన్ని నిర్మించారు.కాగా జోనగూడ, అలిగూడ ప్రాంతంలో నిన్న జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు జవాన్లు మృతిచెందగా మరో ముప్ఫై మంది గాయపడ్డారు.వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.బాధితులను చికిత్స నిమిత్తం రాయపూర్( Raipur ) తరలించారు.మావోయిస్టులు( Maoists ) భారీ టన్నెల్ నిర్మిస్తున్నా నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయని తెలుస్తోంది.దీంతో నిఘా వర్గాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.