వెస్ట్ గోదావరిలో వైసీపీకి భారీ షాక్.. అధికార పార్టీ నేతలే తమ గొయ్యి తవ్వుకున్నారా..?

ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా వైసీపీ తన జెండాను పాతింది.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిన ఉభయగోదావరి జిల్లాలను తమ హస్తగతం చేసుకుంది.

దీనంతటికి అప్పుడు జగన్ పాదయాత్ర కూడా కారణమని కొందరు అంటున్నారు.మరికొందరు రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వాలని భావించి గోదావరి జిల్లాల ప్రజలు ఓట్లు వేశారని అనేవారు లేకపోలేదు.

అయితే, ప్రజలు మెచ్చేలా పాలన చేస్తాడనుకున్న రాజన్న బిడ్డ తమకు వ్యతిరేకంగా పాలన చేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

అసంతృప్తిలో కాపు సామాజిక వర్గం

ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తానని చెప్పిన జగన్ మాట మార్చాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మమ్మల్నిమోసం చేశారని ఫైర్ అవుతున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా జనసేనకు ఓట్లు వేయాలని కాపులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.అయితే, 2014లో గోదావరి జిల్లాల్లో టీడీపీ భారీగా సీట్లను గెలుచుకుంది.2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ హవా నడిచింది.కేవలం మూడేళ్ల పాలనలోనే జగన్ ప్రజల నుంచి తిరస్కరణ పొందడానికి ఆ పార్టీ నాయకుల ప్రవర్తనే కారణంగా తెలుస్తోంది.

A Huge Shock For Ycp In West Godavari Did The Ruling Party Leaders Dig Their Own
Advertisement
A Huge Shock For YCP In West Godavari Did The Ruling Party Leaders Dig Their Own

గతంలో టీడీపీ ఎలాంటి చిక్కులను ఎదుర్కొన్నదో ఇప్పుడు అవే చిక్కులు వైసీపీని వెంటాడతాయని సమాచారం.కీలకమైన కాపు సామాజిక వర్గం పార్టీ నేతలకు దూరమవుతోంది.ఉదా.కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనితకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గ్రూపులు కట్టారట.ఇక ఏలూరులో మాజీ మంత్రి ఆళ్ల నానికి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టాయి.

A Huge Shock For Ycp In West Godavari Did The Ruling Party Leaders Dig Their Own

దెందులూరులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జనాలు ఫైర్ అవుతున్నారు.చింతలపూడిలో ఎలీజాకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు.ఏలూరు ఎంపీ పరిస్థితి కూడా బాగాలేదు.

ఇక నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పరిస్థితి అందరికీ తెలిసిందే.ఆచంటలోనూమాజీ మంత్రి రంగనాథరాజుకు వ్యతిరేకంగాపావులు కదుపుతున్న వారు లేకపోలేదు.

దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీలాగే సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు