జాతీయ రహదారి మధ్యలో మహిమ గల రాయి.. మొక్కితే సమస్యలు దూరం

భారత దేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి జీవిస్తుంటారు.అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదం ఉంది.

ఇక మన దేశంలో చాలా మంది ప్రజలు ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు.ముఖ్యంగా ప్రకృతిని ఆరాధిస్తూ జీవనం సాగిస్తుంటారు.

మతం సంగతి పక్కన పెడితే సూర్యుడిని, చంద్రుడిని, సమస్త ప్రకృతిని దేవతలుగా కొలుస్తుంటారు.ఇక తెలంగాణలో అయితే పూలనే పూజిస్తూ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.

ఇక దేశవ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ దేవతలను పూజించడం పరిపాటిగా వస్తోంది.ఈ క్రమంలో ఇటీవల ఓ ఆసక్తికర ఘటన చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఓ హైవేపై ఉన్న రాయిని ప్రజలు మొక్కుతున్నారు.దాని వద్దకు వెళ్లి పూజించగానే భక్తుల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు పోతున్నాయి.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.కర్ణాటకలోని చామరాజ్ నగర్‌లో ఓ ప్రత్యేక విషయం అందరినీ బాగా ఆకర్షిస్తోంది.

యలందూర్-మాంపల్లి మధ్య ఉండే జాతీయ రహదారిపై చాన్నాళ్ల నుంచి ఓ రాయి ఉంది.దానికి సమీప గ్రామాల ప్రజలు వచ్చి పూజిస్తున్నారు.

రాయికి మొక్కగానే రోగుల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మాయం అవుతున్నాయని స్థానికులు నమ్ముతున్నారు.దీంతో చాన్నాళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధ పడే వారు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తున్నారు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

అయితే ఆ రాయికి స్థానికులు పూజలు చేయడానికి ఓ కారణం ఉంది.అక్కడ నారికల్లు మారమ్మ అనే దేవత ఉందని స్థానికులు బలంగా విశ్వసిస్తారు.

Advertisement

తమ మోకాళ్ల నొప్పులు పోవడానికి ఆ దేవతే కారణమని వారు భావిస్తున్నారు.ఇక కీళ్ల నొప్పులు పోతున్నాయని ఆ నోటా ఈ నోటా చాలా మందికి విషయం పాకిపోయింది.దీంతో అంతా అక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు.

ఆ రహదారి గుండా వెళ్లే వారు ఆ రాయి దగ్గరికి వచ్చి మొక్కుతున్నారు.ఆశ్చర్యకరంగా వారికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మాయం అవుతున్నాయి.

తాజా వార్తలు