పోటీకి సిద్ధం అన్న ఫైర్ బ్రాండ్

ఒకప్పుడు రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న రేణుక చౌదరి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోవడంతో రాజకీయాల్లో తన ఉనికిని కోల్పోయారు అయితే మళ్లీ యాక్టివెట్ అయ్యే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఆమె ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని ఆశ పడుతున్నారు.

విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఆమె బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అత్యంత దీనస్థితికి చేరిందని విమర్శించారు.

తమ ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలు జగన్మోహన్ రెడ్డి వల్ల మసకబారుతున్నాయని,తమ నాయకుడి ఆత్మకు కుమారుడు మూలంగా శాంతి లేకుండా పోయిందని, తమ నాయకుడు పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని హింసిస్తున్నారని, ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రాన్ని ఒక గుండా రాజ్యంలా మార్చేశారని, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి నేడు పిచ్చోడి చేతిలో రాయల మారిందని ఆమె విమర్శించారు .ప్రజా వ్యతిరేకవిధానాలపై హైకోర్టు సుప్రీంకోర్టులు ఎన్ని మొటికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనిఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయనకు వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారువర్సిటీ పేరు మార్చినంత మాత్రాన రాజశేఖర్ రెడ్డి గౌరవం తగ్గటం పెరగడం జరగదని , సొంతంగా యూనివర్సిటీ స్థాపించి ఆ పేరు పెట్టుంటే మరింత అర్థవంతంగా ఉండేదని ఆమె అన్నారు .అమరావతి రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారికి అడుగడుగునా అడ్డుపడి వేధిస్తున్నారని,మీరు ఎంత అడ్డుకుంటే వారి పోరాటం అంతగా విజయవంతమవుతుందని, అమరావతి రైతులు పిలిస్తే తాను కూడా వచ్చి ఆ పోరాటంలో పాల్గొంటానని ఆమె తెలిపారు .అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ పార్లమెంట్ సీటునుంచైనా పోటీ చేస్తానని చెప్పారు .

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు