వైరల్: రిటర్న్ బాక్స్ ప్యాక్ లో పిల్లి.. ఆరు రోజులు నుండి..?!

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద తప్పులుగా మారతాయి.తాజాగా కాలిఫోర్నియాలో( California ) అదే జరిగింది.

ఓ మహిళ అనుకోకుండా తన పెంపుడు పిల్లిని( Pet Cat ) అమెజాన్ రిటర్న్ ప్యాకేజీలో పంపింది.పిల్లి దాదాపు 6 రోజుల పాటు ఆహారం లేకుండా ప్యాక్‌ లోనే ఉండిపోయింది.

ఉటా ప్రాంతానికి చెందిన ఒక మహిళ అమెజాన్ రిటర్న్ ప్యాకేజీలో( Amazon Return Package ) గాలెనా( Galena ) పిల్లిని ఉంచింది.ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని పశువైద్యుని వద్దకు ఆ పార్సెల్ చేరింది.

అప్పటికే పెంపుడు పిల్లి కనిపించడం లేదని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది.తన పెంపుడు పిల్లి దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది.

Advertisement

6 రోజుల తర్వాత, కాలిఫోర్నియాలోని ఒక పశువైద్యుని నుండి తనకి కాల్ వచ్చింది.పిల్లి బాగానే ఉందని యజమానికి చెప్పి, ఆ పిల్లికి తాను తిండి తినిపించాను అని తెలిపాడు.దాంతో సదరు మహిళ వెంటనే ఆనందంతో కాలిఫోర్నియా వెళ్లింది.

ఆ తర్వాత అక్కడ చేరుకొని పిల్లిని తన దగ్గరకు తీసుకోని హత్తుకుంది.కానీ ఒక పిల్లి 6 రోజుల పాటు ఆహారం లేకుండా పెట్టెలో ఉండడం ఆశ్చర్యంగా ఉందని డాక్టర్ చెప్పారు.

పెంపుడు జంతువులు తప్పిపోకుండా మైక్రో చిప్‌తో( Micro Chip ) అమర్చాలని డాక్టర్ చెప్పారు.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రకారం., అన్ని పెంపుడు జంతువులలో మూడింట ఒక వంతు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో కోల్పోతాయి.

కానీ మైక్రోచిప్‌ లు ఉన్న జంతువులను కనుగొనడం సులభం అని వెటర్నరీ డాక్టర్ తెలిపారు.

న్యూస్ రౌండర్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు