చాకచక్యంగా మొసలి పీక పట్టుకున్న చిరుత.. వీడియో వైరల్

వెంటాడి, వేటాడి అడవిలో మిగిలిన జంతువులను క్రూర మృగాలు చంపి తింటాయి.ఒక్కోసారి అవి వేటాడేటప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి.

 A Cheetah Cleverly Caught A Crocodiles Beak The Video Is Viral ,crocodile, Cheta-TeluguStop.com

చప్పుడు చేయకుండా మాటు వేసి, తాము చంపాలనుకున్న జంతువును చటుక్కున నోట కరుచుకుని పారిపోతాయి.అయితే నీళ్లలో ఉండే మొసలికి చాలా బలం ఉంటుంది.

ఎంత అంటే ఏనుగును సైతం అవలీలగా కాలు పట్టుకుని నీటిలోకి లాగేస్తుంది.అంతటి బలం ఉన్న మొసలిని నీటిలో ఎదుర్కోవాలంటే అది నరమానవులకు అసాధ్యం.

చంపి క్షణాల్లో మింగేస్తుంది.అయితే అలాంటి ఓ మొసలికి ఓ చిరుతపులి ఊహించని షాక్ ఇచ్చింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత తనకు కనిపించిన మొసలిని వేటాడింది.

ఈ వీడియోలో ఆకలితో ఉన్న చిరుత పులి పొదల మధ్యలో మాటు వేసినట్లు కనిపిస్తుంది.అయితే చల్లగా, చప్పుడు చేయకుండా పరిసరాలను గమనిస్తుంటుంది.ఇంతలో నీటిలో మొసలి దానికి కనిపిస్తుంది.మొసలిని వేటాడాలని నిర్ణయించుకున్న ఆ చిరుత స్లోగా ఆ నీటి కుంట వద్దకు చేరుతుంది.

నీటిలో నుంచి బయటకు వస్తున్న మొసలి పీకను పట్టుకుంటుంది.ఆ మొసలి తన బలాన్నంతా ఉపయోగించి, చిరుత నోటి నుంచి విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

అయినప్పటికీ దానిని ఏ మాత్రం పట్టు విడవకుండా మొసలిని ఆ చిరుత చంపేస్తుంది.ఆ చంపిన మొసలిని తీసుకొచ్చి ఒడ్డున పడేస్తుంది.

ఆ తర్వాత తాపీగా అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోతుంది.ఫైగెర్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

దీనికి లక్షల సంఖ్యలో వ్యూస్ దక్కాయి.పలువురు ఆ చిరుత బలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube